Sunday, May 30, 2010

అయినావారికి విలువనివ్వు....


Don't Let Somebody Become a Priority in your life,
When you are just an option in their life....

ఈ వాక్యాలు చదవగానే నాకు ఈ టపా రాయాలి అనిపించింది......
ఈ విధంగా అయినా నేను నాలాంటి నలుగురిని మేలుకొలపగలననే ధైర్యంతో రాస్తున్నాను....

ఎదుటి వారి జీవితంలో మనం ఒక ఎంపికే అయినప్పుడు
వారు మన జీవితంలో భాగం కాకుండా చూసుకో అని దీని  భావన...

ఇది నూటికి నూరుపాళ్ళు నిజం.....
దానికి నిలువెత్తు ఉదాహరణ నేనే.....

నా చిన్నప్పుడు నేను మా అమ్మానాన్నల దగ్గర పెరగలేదు....
చాలా ఏళ్ళు.... బహుశా నా ఇంజినీరింగు అప్పుడు ఇంట్లో ఉన్నట్టున్నాను.....

అందువల్లనో ఏమొనండీ నేను వారి యెడల సఖ్యతతో ఉండేదాన్ని కాదు..
గౌరవం మాత్రం ఉండేది... పెద్ద వారు అని అంతే... అంతకు మించి ఏమి లేదు....
నాకు మా అమ్మ అంటే ఇష్టం ఉన్నా కూడా... ఎందుకో నేను తనకి విలువ ఇచ్చే విషయంలో ఎక్కడో పొరపాటు చెసాననుకుంటా..
కావాలనో, కుర్రతనమో తెలీదు కానిండీ.... మా అమ్మ ముందే వెరే వారికి ( పక్కింటి ఆంటీలకి) విలువ ఇచ్చేదాన్నీ
మా నాన్న గారి సంగతి చెప్పనే అక్కర్లేదండీ... అస్సలు వారిని నేను పట్టించుకున్నదే తక్కువ...
ఇది అవసరం అంటే ఆ పని చేయడం... అక్కడి నుంచి తుర్రుమనడం... అంతే... అంతవరకే....

ఇంజినీరింగు 2 సం||ము కల్లా మా అమ్మకూ నాకూ మధ్య స్నేహం మొదలయ్యిందండీ.......
రోజూ తన ఆఫీసు లో జరిగినవి తనూ, నా కాలేజీ విశేషాలు నేను చెప్పుకుంటూ సాయంత్రాలు గడిపేవారము...
అప్పుడప్పుడూ నేను ఇచ్చే సలహాలు అమ్మకి మంచి పేరు తెచ్చిపెట్టేవి.... అమ్మ ఏంతో సంతోషించేది....


అలా ... ఇలా... ఈ స్నేహం బాగా బలపడిపోయాక ఒక రోజు పాత జ్ఞాపకాలు తవ్వుకున్నప్పుడు....
మా అమ్మ చెప్పిన కొన్ని మాటలు... నేను జీవితంలో ఎప్పుడూ... మరిచిపోలేను.....
నేను మా అమ్మను లెక్క చేయనప్పుడు మా అమ్మ ఎంత బాధపడిందీ... తన ముందే వేరే వారికి, వారి మాటలకి విలువ ఇవ్వడం, వేరేవారిని మెప్పించడం కోసం తనని తక్కువ చేయటం ... తనని ఎంతగా బాధ పెట్టాయో చెప్పిందండీ...

ఆ రోజు నాకు కన్నీళ్ళు ఆగలేదండీ...... జీవితంలో ఎంత పెద్ద పొరపాటు చేసానో అర్ధం అయ్యింది.....
అమ్మ మనస్సు ఎంత బాధపడి ఉంటుందో తెలుసుకున్నాను.... ఇంకెప్పుడూ అలాంటి తప్పు చెయ్యకూడదూ అని నిర్ణయించుకున్నాను... 
నాన్న గారికి కొంత దగ్గరయ్యి తనకు కావలిసినవి తెలుసుకుని ముందే తెచ్చి పెట్టడం లాంటివి చాలా చేసాను.. అందుకు ఒకింత తృప్తే ఉన్నా... అమ్మ లాగా నాన్నని కూడా పూర్తిగా అర్ధం చేసుకునేలోపే నాకు ఆ అవకాశం ఇవ్వకుండానే ఆయన నాకు దూరమయ్యరు....

అప్పుడు నేను నిర్ణయించుకున్నను... జీవితం లో నా అని నేను అనుకున్న అందరికీ విలువనిస్తాను....
ఎప్పుడూ నావాళ్ళు అనుకున్నవాళ్ళని ఎదుటివారి ముందు తక్కువ చేసి చూడను... ఎదుటి వారిని సంతోషపెట్టడం కోసం అయినవారిని బాధపెట్టను అని



I will not try to please others by degrading my people.....
I will not give importance to others for our 5 minutes benifit...


The people we all meet will exist only upto 10 days in our entire 60 year life...
I will not use my 10 days to waste my 60years life....

Never try to over-show that you are more interested in others... This may really hurt your dear ones...
This may even cause a big damage...


 ఇప్పుడు మా అమ్మ మాటే నాకు వేదవాక్కని వేరే చెప్పక్కర్లేదనుకుంటా..

Wednesday, May 19, 2010

త్పృవ్వట బాబా ..... లేఖినే సబబా..?


తెనాలి రామకృష్ణుడి "
త్పృవ్వట బాబా "  సమస్యను నేను కొంత వరకైనా పూరించాను అని చెప్పుకునే అర్హత కలిగించిన లేఖినికి నా హృదయపూర్వక నమస్కారములు.....

ఇక అసలు విషయానికి వస్తే ....  ఈ సమస్య తెనాలి రామన్న ఎందుకు , ఎవరిని అడిగాడు....?  వివరాల్లోకి వెళ్తే...

ఒక రోజు శ్రీకృష్ణదేవరాయలి కొలువుకి "సహస్ర ఘంట కవి నరసరాజు" వస్తాడు. ఇతనికి పట్టిన ఘంటం ఆపకుండా రాస్తాడని బాగా పేరు గలదు.
పరుల కవితలలో తప్పులు  పడతాడని పేరు కూడా ఉంది.
తన విద్యను పరీక్షించి విజయ పత్రిక కటాక్షించమని  శ్రీకృష్ణదేవరాయని అర్థిస్తాడు.

సరే అలాగే చూద్దాము, విద్యను ప్రదర్శించమంటాడు  రాయలు.
ఇంతలో పెద్దన ఒక క్లిష్టమైన పద్యము వినిపిస్తాడు. నరస కవి పెద్దన చెప్పిన పద్యము రాస్తాడు

ఎవరికీ ఏమి అర్ధం కాలేదు....
ఇంత కష్టమైన పద్యాన్ని చాలా సునాయాసంగా రాసేసాడని అలోచిస్తుంటారు...

ఇంతలో మన తెనలి రామన్న లేచి ...  ఏది ఈ పద్యం రాయండి చుద్దాం అంటూ ఇలా చెప్తాడు........
త్పృవ్వట బాబా .....
తల పై పువ్వట జాబిల్లి
వల్వ బూదెట ........... చేదే బువ్వట
చూడగ నుళుళుక్కవ్వట  అరయంగనట్టి హరునకు జేజే...


నరస కవి ఘంటం ఒక్కసారిగా ఆగి పోయింది...

తెనాలి రాముడు ఆగ్రహం పట్టలేక  "చెప్పిన పద్యమే రాయలేని వాడవు......  పెద్దన కవిత్వం లో తప్పులు పడతావా అంటూ..."  ఇలా పద్య రూపం లో చివాట్లు పెడతాడు.

తెలియనివన్ని తప్పులని
దిట్ట తనాన సభాంతరమ్మునన్
పలుకగ రాదురోరి పలుమారు పిశాచపు పాడె గట్ట
నీ పలికిన నోట దుమ్ముబడ
భవ్యమెరుంగవు పెద్దలైన వార నిరసింతువా..
ప్రగడరాణ్ణరసా 
విరసా... తుసా..... భుసా...

దానితో నరస కవి తల వంచుకొని వెనుదిరుగుతాడు.
కాని మన రాయల వారు చేతికి ఎముక లేని దాత కదా ఆ కవి కి తగిన బహుమానం ఇచ్చి పంపిస్తాడు...

మరి నా బహుమతి ఎప్పుడు వస్తుందో...?



Tuesday, May 4, 2010

ఒక్క నిమిషం .... ( ఈ -మెయిలు సరదాకి )

హల్లో, 

ఏంటి సడన్ గా మెయిలు.... . 

అది కుడా ఒక్క నిమిషం..... అర నిమిషం..... అని ఆలోచిస్తున్నావా... 
ఏమి లేదు నువ్వు ఎటూ మెయిలు చేయట్లేదు కదా అందుకే నేనే గుర్తుపెట్టుకొని మరీ మెయిలు పంపుతున్నాను... 

అందరూ బాగున్నారు కదా ..? అందరిని అడిగానని చెప్పు..  
జాబ్ ఎలా ఉంది...? P.M. ఏమంటున్నాడు? 
చాలా రోజులైంది మాట్లాడక...... !
నీకు నేను గుర్తుండే ఉంటాను...

ఎప్పుడైనా గుర్తుంటే ఈ మెయిల్ కి రిప్లయ్ ఇవ్వు .... లేదంటే మిస్డ్ కాల్ ఇవ్వు
 

దీన్నే కొంచెం కవిత రూపంలో చెప్పనా..... ?
తీరాల మధ్య దూరం ఎంతైనా ఉండొచ్చు...

కాని మన మధ్య దూరం ఒక్క ఫొను కాల్ మాత్రమే........
అబ్బో.... నాకేమైందొ , పిచ్చెక్కిందో అనుకోకు...!
సరదాకి ఇలా... పెద్దగా పట్టించుకోకు... !

నీ రిప్లై కోసం 1000 కళ్ళతో ఎదురుచూస్తూ నా జీమెయిలు...

రెండు కళ్ళతో ఎదురుచూస్తూ నేను...