ఎంత నొప్పినయినా భరించి
మనలని కనగలదు.........
ఎంత బాధనయినా తట్టుకుని
నాకేమి ఫరవాలేదు అనగలదు.......
ఎన్ని కష్టాలూ వచ్చినా
నీ కోసం నవ్వగలదు.......
ఎవరెన్ని మాటలన్నా
నీ దృష్టిని మరలనియ్యదు......
ఎన్నెన్ని అడ్డంకులు ఎదురైనా
నేనున్నానని అభయం ఇవ్వగలదు..........
ఎన్ని తిట్టినా
విలువైన ఆశీర్వాదము ఇవ్వగలదు........
ఎంత మందిలో ఉన్నా
తనదైన ప్రేమ పంచగలదు........
అంత గొప్పదైన అమ్మ మనసుని
4 మాటలలో చెప్పడం కుదరకపోయినా....
అమ్మ మన కోసం 1 మాటలో చెప్పగలదు.......
ఈ మధ్య ఎక్కడో చదివి బాగా నవ్వుకున్న వాక్యం......
థియేటర్ లో ఇంటర్వెల్ లో కొందరు స్నేహితులు కనిపించి ఎలా పలకరించాలో తెలియక "సినిమా కి వచ్చావా?" అని అడుగుతారు.......
థియేటర్ కి సినిమా చూడడానికి కాకపొతే పల్లీలు అమ్ముకొవడానికి వస్తామా?
అసలు ఉగాది అంటే.... అంటూ మొదలుపెట్టి మిమ్మల్ని ఇబ్బందులలో పడవేయకుండా..... యుగాది పండుగ గురించి నాకు తెలిసిన కొంత మీకూ చెబుతాను....
ఇప్పటికే ఈ పండుగ గురించి చాలా మంది చెప్పి ఉన్న కారణాన, నేను అత్యవసరమైనవి.... వారు చెప్పని 4 మాటలు మాత్రం చెప్పదలిచాను...
యుగాది నూతన సంవత్సరానికి నాంది పలుకుతుంది..... వసంత ఋతువుతో మన ఇంట సుఖ సంతోషాలను నింపుతుంది... యుగాది అంటే యుగానికి ఆది అని చెప్పుకోవచ్చు......
త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవుడు ఈ రోజునే సృష్టి ని మొదలుపెట్టి ,భూమిని,కాలాలను,రోజులను,నెలలను, పగలురాతురులనూ,ఋతువులను,సంవత్సరాలనూ సృష్టించారని మన శాస్త్రము చెబుతున్నది.........
రామాయణ కాలములో ఉత్తరాయణము మొదలైన మొదటి రోజున ఉగాది జరుపుకునేవారట......... అంటే చైత్రము ఆఖరి నెల అన్నమాట.
6వ శతాబ్దములో వరాహమిహిర మహర్షి నూతన సంవత్సరమును చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునేలా మార్చారు......
ఆ విధంగా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మనము ఉగాది పండుగ జరుపుకుంటున్నాం....
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఈ పండుగ సంధర్భంగా ఉగాది శుభాకాంక్షలు చెబుతూ..... అందరికీ ఈ సంవత్సరం.... కొత్త వెలుగు జిలుగులిస్తూ... ఆనందమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.......
స్నేహితులందరం కలిసి చాలా రోజులయ్యిందని ఈ మధ్య కలిసి కాసేపు కబుర్లు చెప్పుకున్నాం...
అందులో విశేషమేముంది...? అది అందరూ చేసే పనేగా అనుకోకండి.....
ఆ మాటల్లోనే కొన్ని విషయాలు తెలిసాయి ...
నా ఫ్రెండ్ వాళ్ళ అక్క కూతురు గురించి చెప్పింది ......
దానికి 3 ఏళ్ళ వయసున్నప్పుడు ఒకసారి వాళ్ళ అమ్మ పిలిచి Apple,Ball చెప్పవే అని అడిగారటండీ...
అందుకా పాప లోపలికి వెళ్ళి పుస్తకం తెచ్చి వాళ్ళమ్మ చేతిలో పెట్టి
"ఇందులో ఉన్నాయి చదువుకో మమ్మీ " అన్నదంట
చూసారా ఈ కాలం చిన్నారుల తెలివితేటలు...
అంత దాకా ఎందుకండీ... మా అక్క స్కూల్ టీచర్ గా పని చేస్తుంది .....
దానికి ఇద్దరు అమ్మాయిలు..... చిన్నది చిచ్చర పిడుగంటే నమ్మండి....
అది చదివేది 2వ తరగతి ..... దానికి స్కూల్ బోరు కొట్టేసిందంట ......
మొన్న వాళ్ళ అమ్మతో అంటుందీ....
"అమ్మా నేను ఇంక స్కూలుకు వెళ్ళను .... ప్రిన్సిపల్ సార్ ని అడిగి నాకు టీ.సీ. తెచ్చేసెయ్యి... నేను హాయిగా ఇంటిలో ఉండి ఆడుకుంటాను , డాన్స్ నేర్చుకుంటాను... ఇంక నేను చదవలేను...!"
పాపం ఆశ్చర్యపోవడం మా అక్కవంతైంది...
దాని స్కూల్స్ అయిపొయాయి , మా అక్క ఇంకా వెళ్ళాల్సి ఉంది, పెద్ద క్లాసు వారికి స్కూలు ఉంటుంది కదా... అందుకు...
అది అంటుందటా...
" అమ్మా రోజూ స్కూలుకేం వెళతావులే గానీ నువ్వు కూడా సార్ ని అడిగి టీ.సీ. తెచ్చేసుకో " అని
కూడలి లో తెలుగు బ్లాగులు మాత్రమే చేర్చబడతాయి అని "కొత్త బ్లాగు చేర్చండి" లంకె లో అడ్మిన్ గారు చెప్పారు.
కానీ కూడలిలో English అనే లంకె అందులో English బ్లాగులు ఉన్నాయి మరి...
మన English బ్లాగును అందరూ చూడాలి అంటే ఎవరికి రాయాలి...?
పెరుగుతున్న గ్యాస్ ధరలు చూస్తుంటే గుండె దడ పుడుతుంది. ఇప్పుడు $4/గ్యాలన్ ఉన్న గ్యాస్ ఇలాగే పెరుగుతూ పొతే ఆకాశాన్నంటుతూ $8/గ్యాలన్ అయినా ఆశ్చర్యపొనక్కర్లేదేమో ......
దీనికి కారణం ఎక్కడో జరిగే ఆందోళనలే అయినా , ఇక్కడ మనల్ని కూడా కల్లోల పరుస్తున్నాయి అంటే అతిశయోక్తి కాదు..
ఇటీవల మా కజిన్ వాళ్ళు కారు కొనుక్కుంటుంటే మేము వెళ్ళాము.
ఆ కారు అమ్మే పెద్దమనిషి అంటారు "మా కాలంలో అయితే 80 సెంట్లకి గ్యాలన్ చొప్పున $8 కి టాంక్ నిండిపొయేది" అని
మరి రాబొయే కాలం చూస్తుంటే $80కి అయినా టాంకు నిండేనా....?