ఇది కూడా బాధేనండీ....మరి మీరేమంటారు....?
ఏది బాధా........? ఎందుకా బాధా.....? అంటారా..? అదే చెబుతాను చదవండి....
మొన్న నేను వంట చేసాక అమ్మతో మాట్లాడుతున్నానా.......నాకు అనుకోకుండా ఒక ఆలోచన వచ్చింది......
అమ్మతో అనలేదు లెండి కానీ మీతో పంచుకుంటున్నాను....
ఆలోచన అంటావు..... బాధ అంటావు ... ఏంటో చెప్పొచ్చు కదా అంటారా ....... అలాగే ఐతే మీరే చదవండి......
తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి చేసి పంపుతారు కదా........ అదే ఆడపిల్లలకే లెండి ........
అలా పంపాక ఆడపిల్లలు ముందు నేర్చుకున్నా నేర్చుకోపోయినా............
ఎంతో కష్టపడి వంట చేస్తూ కొద్దిరోజుల్లోనే అందులో ప్రావీణ్యత సంపాదించుకుంటారు...
అది కొత్తగా చెప్పాలా... మాకు తెలియదా అనకండి.... విషయములోకి వస్తున్నా....
ఒకవేళ ఆ తల్లిదండ్రులకి ఆడపిల్లలు మాత్రమే ఉన్నారనుకోండి......... పిల్లల పెళ్ళిళ్ళు చేసి పంపేసాక వారికి పెద్దతనం వల్ల ఏ జ్వరమో , వంట్లో బాగోలేకపోవడమో వచ్చిందనుకోండి .... (రావాలని నా ఉద్దేశ్యం కాదు...) నాన్నకా... పొయ్యి వెలిగించి టీ పెట్టడం కూడా రాదు......... ఎంత ఓపిక లేకపోయినా అమ్మకు లేచి వంట చేయడం తప్పదు........
ఎంతో బాగా వంట చేయడం వచ్చి పాట్లక్కులకి (PotLucks/Get-togethers ki) వాటికి వంట బ్రహ్మాండంగా చేసి అందరి మన్ననలు అందుకొని అమ్మకి ఫోను చేసి మరీ "అమ్మా....! ఇవాళ నేను చేసిన గుత్తొంకాయ ఎంత బాగా కుదిరిందో ...... అందరూ చాలా మెచ్చుకున్నారు" అని చెప్పే కూతురికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధగా ఉంటుందో కదండీ....
"నువ్వు నేర్పిన వంటనే నేను రకరకాలుగా చేయగలిగినా ఒక్క రకం కూడా నీకు చేసి పెట్టలేని నా ఈ స్థితిని ఎలా వివరించాలో తెలియడంలేదని " ఆ అమ్మడి గుండె ఎంత విలవిలలాడుతుందో కదా....
అంటే ఆడవారికేనా బాధ మాకు ఉండదా అంటూ గొడవకి రాకండి...... మీ గురించి కూడా చెబుతున్నాను.....
కూతురిని అత్తారింటికి పంపాక, ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండీ...............??
కొడుకులకు కూడా ఆ బాధ ఉంటుందండి........ (ఏదీ ...? వంట చేసి పెట్టడమా అనకండి....!)
అమ్మ ఎప్పుడైనా "నాన్నకి బాగాలేదురా ....! ఆస్పత్రి కి ఒక్కరే వెళ్లి వచ్చారు" అన్నప్పుడో........!
"ఇవాళ కరెంటు బిల్లు వచ్చిందిరా నాన్నకి బాగోలేదని నేనే ఎలాగోలా కట్టేసి వచ్చాను " అన్నప్పుడో.......!!
లేక
"పండక్కి వంటలేమి చేసావు అమ్మా............?" అని కొడుకడిగితే
"ఉన్నది మేమిద్దరమే కదరా... ఏమి వండినా తినేది ఎవరు.... అందుకే కాస్త పులిహోర కలిపి నైవేద్యం పెట్టేసా" అని చెప్పే అమ్మ మాటలు విన్నప్పుడు.....
అబ్బాయిలకి కూడా బాధగా ఉంటుందండీ....
మరి ఇంత బాధ పడేవాళ్ళు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి .....? విదేశాలకెందుకు వెళ్ళాలి.........? అని అడుగుతారేమో........!!
ఆడపిల్లలకి పెళ్లి చేయకుండా ఏ తల్లిదండ్రులు ఉంటారు చెప్పండి ......?
ఏదో బలీయమైన కారణం లేనిదే ఏ కొడుకైనా తన తల్లిదండ్రులను వదిలి దేశాలు పట్టుకు వెళ్ళిపోతాడా చెప్పండి........??
అవి ఎటువంటి కారణాలైనా కావచ్చు......... కానీ ఇవి కూడా బాధలేనండీ........ మరి మీరేమంటారు........?
Sunday, January 22, 2012
Friday, January 20, 2012
విధి వంచితుడు - కథ (కొండపల్లి జోగారావుగారు)
మా తాతగారైన కొండపల్లి జోగారావుగారు రాసిన కథల కాపీని నేను నా బ్లాగులో జతపరుస్తున్నాను.
నేనడిగినదే తడువుగా నాకు కథలను పంపిన తాతగారికి నా సవినయ నమస్కారములు తెలియజేసుకుంటూ.....
మొదటి కథ --- విధి వంచితుడు
కింద Scribd టూల్ యొక్క మొదటి బటన్ 'View in Full Screen' క్లిక్ చేసి Full Screen లో చదవండి....
విధి వంచితుడు

Friday, January 13, 2012
సంక్రాంతి శుభాకాంక్షలు
మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
అసలు సంక్రాంతి అంటే... అంటూ మీకు లెక్చర్లు దంచకుండా
క్లుప్తంగా దాని విశిష్టత చెప్తాను
సూర్యుడు వెలుగునిచ్చెవాడే కాదండోయ్ మనం కొలిచే దైవం కుడా ....
సూర్యభగవానుడు ఒక సంవత్సర కాలంలో 12 రాశుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు.
ఆ సూర్యభగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి తిరిగడాన్ని " సంక్రమణం" అంటారు ..........పూర్తిగా చదవండి

Wednesday, January 4, 2012
జున్నుకై కట్టిన పన్ను - ఒక చిన్న కథ
జున్నుకై కట్టిన పన్ను - ఒక చిన్న కథ
శ్రీనివాస్ అమెరికాలోని పెద్ద సాఫ్టువేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
అతడికి ఎంతసేపు పని మీద ధ్యాస తప్ప ఇంకో మాట లేదు.
శ్రీనివాస్ బామ్మేమో వాడు ఈ పండక్కి వస్తాడు ఆ పండక్కి వస్తాడనుకొని పిండి వంటలన్నీ చేసి ఉంచేది. వాడేమో ఫోనులోనే శుభాకాంక్షలు, స్కైపులో (Skypeలో) ఆశీర్వచనాలతో కాలం గడిపేస్తున్నాడు.
"ఎందుకురా వాసూ...!! అంత సంపాదన ఏం చేసుకుంటావ్" అని బామ్మ అడిగితే
"ఇంకో రెండేళ్ళు ఉంటే పచ్చ కార్డు వస్తుందే బామ్మ" అన్నాడు.
"ఓసి పిచ్చి వెదవా అందుకా....! మరి ఆ ఏడుపేదో ముందే ఏడవొచ్చుగా...... అయినా చక్కగా మన ప్రభుత్వం వారిచ్చిన తెల్లకార్డు నా దగ్గర ఉందిగా ...... అది నీ పేర మార్పిస్తాలే నువ్వొచ్చెయ్యి" అంది గ్రీన్ కార్డ్ అంటే తెలియని బామ్మ.
"నీకు చెప్పినా అర్థం కాదులేవే బామ్మా...!!" అంటూ ఫోను పెట్టేసాడు.
ఇది ఇలా ఉండగా మన బామ్మ గారికి ఇక విసుగొచ్చేసింది , ఇహ వీడు రాడనుకొని వంటలు చేయటం, ఎదురు చూడ్డం రెండూ మానేసింది.
ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ మన వాడికి తానెప్పుడో చిన్నప్పుడు తిన్న ' జున్ను ' గుర్తుకొచ్చింది.
ఇంక ఒక్క క్షణం ఆలోచించకుండా దొరికిన విమానం ఎక్కి ఇంటి దారి పట్టాడు.
నేను వస్తున్నానే బామ్మా అని నెత్తీ నోరూ బాదుకున్నా 'నేను చచ్చినా నమ్మను , ఇంక ఎప్పుడూ నీతో మాట్లాడను పోరా' అంటూ బామ్మ ఫోను పెట్టేసింది.
బామ్మకు విషయం చెప్పి ఎయిర్ పోర్టు కి జున్ను తెప్పించుకుందాం అనుకున్న వాడి ఆశ అడియాశే అయ్యింది.
సరే చేసేది లేక ఆ కొన్ని గంటలు ఎలాగోలా గడిపేసాడు...
విమానం దిగీ దిగగానే ఏ షాపులోనైనా జున్ను కనబడుతుందేమో అని ఆత్రంగా వెదకసాగాడు....
అదేమైనా పాల దుకాణమా... ఎయిర్ పోర్టు ..... అక్కడెందుకుంటుందీ .....
కానీ తాను లేని ఈ 10 సం||లలో వచ్చిన మార్పుని పెద్దగా గమనించలేకపోయాడు ఈ హడావిడిలో....
సరే బ్యాగులందుకొని టాక్సీ ఎక్కి , ఒక రైలు, ఒక బస్సు మారి ఊరు చేరాడు......
ఊర్లోకొచ్చిన తర్వాత అందరూ తనని వింతగా చూస్తుంటే ఒక్క మాటా మాట్లాడకుండా ఇల్లు చేరాడు.....
బియ్యం కడిగిన నీళ్ళు ఇంటి ముందు చెట్లో పోద్దామని వచ్చిన బామ్మ ఒక్కసారిగా వీడిని చూసి ఆనందం పట్టలేక
"ఒరే వాసూ! నువ్వు వస్తున్నా వస్తున్నా అంటే నమ్మకుండా పోరా అని ఫోను పెట్టేసానని,ఇంక ఎప్పుడూ నీతో మాట్లాడను అన్నానని రెక్కలు కట్టుకుని వచ్చేసావా నాయనా......!! మా నాయనే.... మా తండ్రే ..... మా బాబే " అంటూ దగ్గరకు తీసుకొని ముద్దుచేయసాగింది.
వీడి జున్ను ఆత్రంతో 'అవును ' అని అబద్దమైనా ఆడలేక "కాదే బామ్మ జున్ను తినాలనిపించి వచ్చాను" అన్నాడు.
బామ్మ ఒక్క క్షణం బిత్తరపోయి పిచ్చి వాడిని చూసినట్టు చూసి "జున్ను తినడానికి వచ్చావా ఇన్ని సంవత్సరాల నుంచి నీకిష్టమని ప్రతి పండక్కి అరిశెలు, సున్నుండలు , చక్రాలు , చెక్కలు చేసి ఉంచుతుంటే ఒక్క నాడైనా ఏం చేసావే బామ్మా అని అడగలేదుగానీ జున్ను కోసం వచ్చాడట...... జున్ను కోసం" అంటూ కొంగు ముడేసుకుంటూ బియ్యం కడిగిన నీళ్ళు చెట్లో పోసి లోపలికి వెళ్ళిపోయింది.
వెళ్ళనైతే వెళ్ళింది కానీ ' ఇప్పటికిప్పుడు జున్నంటే ఎక్కడ నుంచి వస్తుంది.. అదేమైనా పిండి రుబ్బి దోశలేయడమా క్షణాల్లో అయిపోవడానికి , అయినా వీడికీ వేవిళ్ళ కోరికేంటో ' అని మనసులో అనుకుంది...
ఇటు మన శ్రీనివాసుడు మాత్రం నివాసనికి చేరినా వాసాలు లెక్కపెడుతూ కూర్చోవల్సి వస్తుంది..... బయట ఊరి జనం ఏదో కొత్త జంతువుని చూసినట్టు చూస్తున్నారే....... అని బాధపడసాగాడు.
ఇంతలో స్నానానికి పనివారి చేత నీళ్ళు తోడించి , అవి కాగి వాడు స్నానం చేసే లోపు భోజనం తయారు చేయసాగింది బామ్మ...
మరి ఒకటా రెండా 10ఏళ్ళ తర్వాత మనవడు ఇంటికి వస్తే ఒక్క పప్పు, చారు వేసి పెడుతుందా .......!!
స్నానం చేసి బట్టలు మార్చుకునే లోపు మనవడికి ఇష్టమని చింతచిగురు పప్పు, దోసకాయ పచ్చడి, కొబ్బరిమావిడికాయ పచ్చడి, గుత్తి వంకాయ కూర, పనస పొట్టు ఆవ పెట్టిన కూర, చుక్క కూర పులుసుకూరా, మావిడికాయ పులుసు, మజ్జిగ పులుసు, గడ్డ పెరుగు, పెరుగులోకి మాగాయ, నిమ్మకాయ అప్పుడే జాడీలోంచి తీసి అలాగే పప్పులోకి, పులుసు లోకి తింటాడని గుమ్మడొడియాలు, చల్ల మిరపకాయలు వేయించి , అప్పుడే తీసిన వెన్నతో నెయ్యి కాచి పొయ్యి దగ్గర నుంచి లేచి వచ్చింది.
ఇన్నీ అయితే చెయ్యగలిగింది కానీ వాడడిగిన జున్ను మాత్రం తెప్పించలేకపోయింది.
ఇంతలో స్నానం చేసి వచ్చి ఆత్రంగా వంటింట్లో వెతకసాగాడు, ఖచ్చితంగా బామ్మ తనకోసం జున్ను తెప్పించి ఉంటుందనే నమ్మకంతో...... వాడు రావటం గమనించిన బామ్మ వంటింట్లోకి వచ్చి " ఒరేయ్...! ముందు భోజనం చెయ్యరా జున్ను పక్కూరిలో దొరుకుంతుందేమో తెమ్మని మనిషిని పంపాను వాడు వచ్చేసరికి సాయంత్రం అవుతుంది " అని చెప్పి పీట వేసి అరిటాకులో భోజనం పెట్టడం మొదలుపెట్టింది.
ఏవి చూసిన రెండు, రెండు ఉండటంతో "అన్నీ ఒక రొజే చెయ్యాలా బామ్మా...!! రోజుకో రకం చేసిపెట్టొచ్చు కదా..... నీకు మరీ ఆత్రం ఎక్కువ..." అన్నాడు.
దానికి బామ్మ వస్తున్న నవ్వు ఆపుకుంటూ "నీ జున్ను పై కన్ను చూస్తుంటే అది దొరక్కపొతే ఒక్క క్షణం కూడా ఆగేటట్టు లేవు అందునా అమెరికాలో 10ఏళ్ళు ఉన్నాక నీ కోరికలు ఎలా మారాయో తెలుసుకోవడం కష్టమని నిన్ను చూస్తే అర్థం అయింది. అందుకే నీకు నచ్చింది వేసుక తింటావని అన్నీ రెండు రకాలు చేసాను లేరా" అంది.
ఆశ్చర్యపోవడం మన శ్రీనివాసు వంతయ్యింది.........
బామ్మ అన్నట్టుగానే ఎక్కడా జున్ను దొరకలేదు...... సరే హైదరాబాదులో దొరుకుతుందేమో వెతుక్కుంటానంటూ రెండో రొజే పట్నం బయలుదేరాడు..... సరే కానిమ్మని అమెరికా వెళ్ళేలోపు ఒకసారి వచ్చి కనబడిపొమ్మని చెప్పింది బామ్మ.
హైదరాబాదులో అడుగుపెట్టాక అర్థం అయ్యింది దేశం తను వదిలి వెళ్ళినప్పటిలాగా లేదని.......
రోడ్డు పక్క బండి మీద సాదా దోశ తిని , టీ తాగితే 70రూపాయలు...
10 రూపాయలు తీసి ఇవ్వబొతే "నాకు టిప్పక్కర్లేదు మీ బిల్ 70/- అవి ఇవ్వండి చాలన్నాడు" బండివాడు.......
మిరపకాయ బజ్జీలు 10 కి 2 , చాట్ తింటే 30 రూపాయలు.....
ఒక్కసారి తన చుట్టూ ప్రపంచం గిర్రున తిరగసాగింది..... ఇక జున్ను పరిస్థితేంటో అనుకుంటూ వెదకసాగాడు..........
ఆఖరున ఒక చోట ' ఇచ్చట జున్ను అమ్మబడును ' అన్న బోర్డు కనబడింది.
ఆత్రంగా అందులోకి దూరి అర్జెంటుగా 100రూపాయల జున్ను ఇమ్మన్నాడు.....
కొట్టువాడు పిచ్చివాడిని చూసినట్టు చూసి " 100కి జున్ను వేసే పేపర్ కప్పు కూడా రాదు , 1000 రూపాయలు మినిమం కొనాల్సిందే..... అయినా అది ఎప్పుడు పడితే అప్పుడు దొరికేది కాదు ... మీ ఫోను నెంబరు , 500 అడ్వాన్సు ఇచ్చి వెళితే సరుకు వచ్చినప్పుడు కాల్ చేస్తాం...... మేము ఫోను చేసి మీరు వచ్చే లోపు జున్ను అయిపొతే మాత్రం మీ డబ్బు తిరిగి ఇవ్వబడదు" అని చెప్పి పనిలో మునిగిపోయాడు.
అమితాశ్చర్యానికి లోనయ్యి గొంతు పెగుల్చుకొని "ఎన్ని రోజులు పట్టొచ్చు?" అని అడిగాడు.
దానికి వాడు "చెప్పలేము వారం పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు" అన్నాడు
అమెరికాలో పచ్చకార్డ్ కోసం కూడా ఇంత ఆత్రంగా వెయిట్ చేసి ఉండడు......
పాపం.......!! ఏంచేస్తాం కాలం అటువంటి మార్పులు తెచ్చిపెడుతుంది.
"మరి నేను అమెరికాలో ఉంటాను, కొద్ది రోజులకోసమే ఇక్కడికి వచ్చాను. ఎలా" అని కొట్టు వాడిని అడిగాడు శ్రీనివాసు.
దానికి వాడు "ఒహొ అలాగా....!! ఏం ఫర్వాలేదు మా బ్రాంచ్ అక్కడ కూడా ఉంది కాకపొతే అక్కడికి జున్ను పంపడానికి అయ్యే ఖర్చు , కస్టంస్ క్లియర్ అవ్వడానికి అయ్యే ఖర్చు, షిప్పింగు , హాండ్లింగు చార్జీలు మొదలగునవి అన్నీ మీరే కట్టాలి. ఒకవేళ అమెరికా వారు దీని మీద పన్ను విధిస్తే అది కూడా మీరే కట్టాల్సి ఉంటుందని" తాపీగా చెప్పుకొచ్చాడు.
విధిలేక డబ్బు కట్టి , వివరాలవీ ఇచ్చి , ఊరికెళ్ళి బామ్మ చేసిన పిండివంటలు పట్టుకుని తిరుగు ప్రయాణం కట్టాడు మన శ్రీనివాసు......
అమెరికాలోనైనా జున్ను దొరికేనా.......?? ఎప్పటికైనా శ్రీనివాసు బామ్మ దగ్గరికి తిరిగొచ్చేనా .....?? కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది......

Wednesday, December 21, 2011
దయ్యంతో నా అనుభవం
దయ్యంతో నా అనుభవం
కొంచెం పెద్ద అనుభవమే.... తీరికున్నప్పుడు చదవండేం.....
అప్పుడు నాకు 10 ఏళ్ళు ఉంటాయేమో. వేసవి సెలవలకి అమ్మమ్మా వాళ్ళ ఊరు వెళ్ళాను.
ఆట పాటలతో , పుస్తకాలు చదవడంతో కాలక్షేపం అయిపోయేది.
ఇది ఇలా ఉండగా ఒక రోజు అందరి భోజనాలయ్యాక ఆరుబయట మంచాలేసుకుని చుక్కలని చూస్తూ ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. ( ఆ మరే నేనో పెద్దనాపసానినని నేను చెప్పింది అందరూ వింటారా ఏంటి... అమ్మా వాళ్ళేదో మాట్లాడుతుంటే మనం కిక్కురుమనకుండా పక్కన కూర్చుని వినడమే....)
ఈలోగా మావయ్య వచ్చాడు. హమ్మయ్య మావయ్యైతే కాసేపు మాతో ఆడుకుంటాడూ , బోలెడు కథలు చెప్తాడని.... ఇక ఇక్కడ మనకేమి పని అనుకొని నేనూ మా అక్కా మావయ్య దగ్గరికి పరుగెత్తుకెళ్ళాం.
మావయ్య తింటూ మాకూ చెరో ఆవకాయ ముద్దా, పెరుగన్నం ముద్దా పెడితే ఎంచక్కా వద్దనకుండా తినేసాం.
ఈ విషయంలో అమ్మ ఎప్పుడూ తిడుతూ ఉండేది "మావయ్య తినే రెండు ముద్దలన్నా తిననియ్యండే... !" అని.
దానికి నేనేదో పెద్ద గొప్ప పండితురాలిలాగా ఒక రోజు మావయ్య తినే ముద్దలన్నీ లెక్కపెట్టి "మావయ్యా..! నువ్వు తినేది 23 ముద్దలైతే అమ్మేంటి 2అని అంటుంది" అని అడిగాను.(అమ్మని అడగాలంటే చచ్చేంత ధైర్యం కావాలి తెలుసా..)
సరే ఇక విషయానికి వస్తే మావయ్య భోజనం చేసాక "కథలు చెప్పూ..! కథలు చెప్పూ...! " అంటూ ఇద్దరం గోల చేసేసరికి , మావయ్య అరుగెక్కి కూర్చుని మమ్మల్ని చెరో పక్క కూర్చోబెట్టుకుని కథలు చెప్పడం మొదలెట్టాడు.
పాపం మా మావయ్య తన మానాన తను చందమామ కథలు చెప్తుంటే నేనే ఆపి "మావయ్యా ! నువ్వు నిజంగా దయ్యాన్ని చూసావంట కదా.... మరి ఆ కథ మాకెప్పుడూ చెప్పలేదేంటి?" అని ఏదో గొప్ప రహస్యం బయట పెట్టినదానిలాగా నడుమ్మీద చెయ్యేసుకుని నిలదీసినట్టుగా అడిగాను.
దానికి మా మావయ్య "నీకెవరు చెప్పారే.... అన్నీ ఇట్టే తెలుసుకుంటావ్.... అయినా అది చిన్నపిల్లలు వినే కథ కాదులే" అని మమ్మల్ని శాంతిపచూసాడు.
ఈ చిన్నపిల్లలు చూడకూడదు/వినకూడదు/మాట్లాడకూడదు అనే మాటలున్నాయి చూసారాండీ అవి మహా చెడ్డవి.
ఎక్కడ లేని రోషాన్ని తెచ్చిపెడతాయి. అన్ని లాజిక్కులనీ గుర్తుచేస్తాయి...
పొగిడినట్టే పొగిడి మా మవయ్య వేసిన చురకకి మన బుర్ర పాదరసంలాగా పని చేసి 'ఏ అర్థరాత్రి ఫోను వచ్చిందని చిన్న తాతయ్య ఇంటికి పంపినప్పుడు చిన్నపిల్లలము కామా.... ? బావినుంచి నీళ్ళు తెచ్చేటప్పుడు (చిన్న బిందెడు - తిప్పి కొడితే లీటరు నీళ్ళు ఉండవు - పూజకని మాచేత స్నానమవగానే తెప్పించేవాళ్ళు) చిన్నపిల్లలము కామా....?' ఇలా నిలదీసేసరికి మావయ్యకి ఏమిచేయాలో పాలుపోక సరే చెప్తాను కానీ 'నిద్రలో భయపడి లేస్తే మావయ్యే దయ్యం కథ చెప్పాడని మీ అమ్మకి చెప్పొదని మా ఇద్దరి దగ్గర మాట తీసుకున్నాడు.
సరే నీకెందుకు ప్రాణం పోయినా మాట తప్పం అన్న రేంజ్లో మొహాలు పెట్టి చెప్పమన్నట్టుగా సైగ చేసాం.
మా మావయ్య చెప్పిన నిజం దయ్యం కథ :
ఒకరోజు నేను నా స్నేహితులతో కలిసి పొలంలో పడుకోవటానికి వెళ్ళాను. (అంటే జీతగాళ్ళు ఊరికెళ్ళినప్పుడో , ఏదైనా దొంగల భయం ఉన్నప్పుడో మావయ్య కూడా వెళుతుండేవాడు). సరే అందరం ఇంట్లో భోజనాలు చేసే వచ్చాము కదా అని వస్తూ వస్తూ కొట్లో కూల్ డ్రింకులు తెచ్చుకున్నాం (నేనైతే అస్సలు నమ్మలేదండీ....)
అందరం ముచ్చట్లు పెట్టుకోవడం మొదలెట్టాము మధ్య మధ్యలో కూల్ డ్రింకు తాగుతూ పిచ్చా పాటీ మాట్లాడుకుని, కాసేపు అంత్యాక్షరీ అని గుర్తొచ్చిన పాటలన్నీ పాడుకొన్నాము. అర్థరాత్రైంది పడుకుందాం అనుకొని అందరం బాత్రూం కి వెళ్ళి వచ్చాము.
పడుకోబోతుండగా ఒక నిప్పు రవ్వ (మంట లాంటిదంట) మాకు దూరంగా కనబడింది.
ఈ టైములో ఎవరుంటారా అని ఏవో తెలిసిన 2,3 పేర్లు పిలిస్తే ఎవరూ పలకలేదు. అది చూస్తూ చూస్తూ దగ్గరయ్యి మా పక్కగా మన పొలంలోని బావి దగ్గరకి వెళ్ళి 3 సార్లు బావి చుట్టూ తిరిగి బావిలో పడిపోయింది.
అప్పటి వరకు ధైర్యంగా కబుర్లు చెప్పుకున్న మేము ఏమీ అర్థం కాక బిక్కచచ్చి పోయాము. అంతలో నా మిత్రుడొకడు అరేయ్ వారం రోజుల క్రితం మన ఊరి XXX ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది కదా.... కొంపదీసి అదే దయ్యమయి ఇలా తిరుగుతుందేమోరా ....! అన్నాడు.
అంతే ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయ్యింది. ఒక్కరికి నిద్రపడితే ఒట్టు.
ఇంక ఒకరి తరువాత ఒకరు వాళ్ళకు తెలిసిన దెయ్యజ్ఞానం పంచడం మొదలెట్టారు.
అరే ఇలా నిప్పురూపంలో తిరిగే దయ్యాలని "కొరివి దయ్యం" అంటారంటరా....."XX దెయ్యం' (పేరు మర్చిపోయాను) ఎప్పుడూ కట్టెలు విరుస్తూ ఉంటుందంటరా..... ఫలానా దెయ్యం ఇష్టమైన వాళ్ళతొనే మాట్లడుతుందంటరా...... అరే ఎవరూ కనబడకపోయినా రాయి విసిరితే అది ఎవరికైనా తగిలినట్టుగా కిందపడితే (డైరెక్టుగా కిందపడకుండా అని అర్థం లేండి) ఖచితంగా దయ్యమే అంటరా..... కోరికలు తీరక చనిపోయినవారు ఆత్మలయి ఎదో ఒక దానిలోకి దూరి వారి కోరికలను తీర్చుకుంటాయంటరా...... ఇలా నోటికొచ్చినవన్నీ చెబుతుంటే ఒక్కొకరికీ భయం పెరిగిపొయింది....
ఇంతలో తెల్లవారుతుందగా ఇటుగా ఎవరో వస్తున్నట్టు అలికిడికాగానే అందరం తలా ఒక రాయి ఏరి విసిరికొట్టాము. దానికి భయపడ్డ మన జీతగాడు (అదృష్టవశాత్తు ఒక్క రాయీ తగల్లేదు) "అబ్బో..! అమ్మో...!" అంటూ మొత్తుకుంటూ వెనక్కి పరిగెత్తాడు. జీతగాడి గొంతు గుర్తుపట్టగానే అందరూ ఊపిరి పీల్చుకుని, వెనక్కి తిరిగి చూడకుండా ఇళ్ళకి పరిగెత్తాము.
ఆ తర్వాత ఏమైందో తెలీదు కానీ ఎవ్వరూ దయ్యాల మాట మాత్రం ఎత్తలేదు.
---------------------------------------------------------------------------------
నాకెందుకో మా మావయ్య సగం కథ ఎగరగొట్టేసాడని గట్టి నమ్మకం. సరే కానిమ్మని మావయ్యను కాసేపు ఆటపట్టించి నిద్రపోదామని అమ్మ దగ్గరకు వెళ్ళాము. లోలోపల మాకు కొంచం భయంభయంగానే ఉంది.
ఇంతలో మా చినతాతగారికి అర్జెంటు ఫోను. మామూలుగానైతే ఏ భయం లేకుండా పరుగెత్తుకెళ్ళి
పిలుచుకొచ్చేదాన్నీ....... కానీ కాస్త భయం కూడా తోడయ్యేసరికి నిద్రముంచుకొచ్చినట్టు నటించాను.
కానీ అమ్మ ఊరుకోదు కదా "అందరూ పడుకున్నారు ఇద్దరూ ఇప్పటిదాకా కబుర్లాడారు కదా అంతలోనే నిద్ర ముంచుకొచ్చిందా" అని కోప్పడుతూ వెళ్ళి రమ్మంది........
సరే దేవుడి మీద భారమేసి గేటు దాటి కొంచం దూరం వెళ్ళాను.
నాకక్కడ ఏదో ఆకారం ఉనట్టుగా కనిపిస్తుంది ఎందుకైనా మంచిదని వెనక్కి వెళ్ళి 'అక్కను కూడా రమ్మను.... ఇప్పటిదాకా అది కూడా కబుర్లాడిందిగా మరీ' అన్నాను. సరే అక్క కూడా నా వెంట వచ్చింది. అక్కడి దాకా వచ్చాక
అక్కని ఆపి 'అక్కా...! అక్కా....! అక్కడేదో ఉంది చూడు గాడిదలాగనో / గుర్రంలాగానో ఉంది కదా ' అన్నాను.
ఈ భయం మహ చెడ్డదండి ఉన్నది లేనట్టుగాను , లేనిది ఉన్నట్టుగాను , వినపడకపోయినా వినిపించినట్టుగాను ఉంటుంది. పాపం మా అక్క నా మాటల ప్రభావం వల్ల అది గాడిద అని నిర్ధారణ చేసింది. ఇక అంతే వెనక్కి
చూడకుండా పరిగెత్తి చిన తాతయ్య దగ్గరికి వెళ్ళి ఫోను వచ్చిందని చెప్పి... అలాగే గాడిద సంగతి చెప్పాము..... తాతగారికి ఏమీ అర్థంకాక పనివారిని వెంటబెట్టుకు వచ్చి.... ఇంట్లో అందరినీ లేపేసి హడవిడీ చేసేసి అక్కడ ఏమి లేదు చెట్టుకొమ్మ విరిగిపడిందని తేల్చేసారు.
కానీ అమ్మ ఊరుకుంటుందా " ఫోనొచ్చింది పిలుచుకురమ్మంటే ఇంత రాద్ధాంతం చేస్తారా" అని తిట్ల వర్షం కురిపించడం మొదలెట్టింది..... వెంటనే నేనందుకుని 'అక్కడేదో ఉన్నట్టుంది కదక్కా అంటే అక్కే అది గాడిదే అని చెప్పిందీ' అన్నాను.
దానికి పాపం అందరి నుంచి తిట్లు 'చిన్నపిల్ల దానికి బుద్ధి లేకపొతే నీకేమయ్యింది..... XXXX.....XXX ' అంటూ.
ఇప్పటికీ ఎప్పుడైన మా అక్కకి ఆ విషయం గుర్తుకు వస్తే మాత్రం ఛాన్స్ వదలకుండా తిడుతుంది....

Thursday, December 15, 2011
నాకే నవ్వొచ్చింది
నాకే నవ్వొచ్చింది
నేను చదువుకునే రోజుల్లో ఒక కథ రాసాను... అది అంతగా హాస్యం పండించకపోయినా ఎందుకో చదువుకుంటే నాకే నవ్వొచ్చింది...
బ్లాగు మొదలుపెట్టిన కొత్తలో పోస్టు చేసిన ఆ కథ లింకు ఇక్కడ

Wednesday, December 14, 2011
అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు
అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు
మల్లెకన్నా తెల్లనైన అమ్మ మనసుకు వందనం
మంచుకన్న చల్లనైన అమ్మ చూపొక నందనం
ముత్యాలమూటలైన మాటలకు , రత్నాలరాశులైన అండదండలకు అభివందనం
అమృతమయ చేతులకు , అనంతమైన ఆశీర్వచనములకు పాదాభివందనం
అన్నిటికన్నా మిన్నైన అమ్మ ఒడిలోని వెచ్చందనానికి
అమ్మ చూపులోని కరుణకు , అమ్మ చూపించే ప్రేమకు ఆనందమయ జన్మదినం
అమ్మ ఇలాగే కలకాలం సంతోషంగా,ఆనందంగా, ఆరోగ్యవంతంగా జీవించాలని కోరుకుంటూ
హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు

Subscribe to:
Posts (Atom)