Tuesday, July 2, 2013

80 ఏళ్ళ మనిషి జీవితం



ఇది నేను ఈ మధ్య Facebook లో చదివాను.
నా బ్లాగు మిత్రులతో కూడా పంచుకోవాలనిపించి ఇక్కడ రాస్తునాను...

మొదటి రోజున దేవుడు ఆవును(గోమాతను) సృష్టించి "నువ్వు రోజు యజమాని(రైతు)తో పాటు పొలానికి వెళ్ళి పని చేయాలి, లేగదూడలను కని పాలిచ్చి రైతన్నకు అండగా ఉండాలి. నీకు 60 ఏళ్ళ జీవితాన్ని ప్రసాదిస్తున్నాను" అని అన్నారు.

అందుకు గోమాత "60 ఏళ్ళు అలాంటి జీవితం గడపడం కష్టం.... నాకు 20 ఏళ్ళు చాలు మిగితా 40ఏళ్ళు తిరిగి ఇచ్చేస్తాను" అంటుంది. దేవుడు అందుకు అంగీకరిస్తారు.

రెండవ రోజు దేవుడు కుక్కను సృష్టించి "నువ్వు రోజంతా ఇంటిముందు కూర్చొని వచ్చేపొయేవారిని చూసి అరుస్తూ ఉండాలి. నీకు 20ఏళ్ళ జీవితం ప్రసాదిస్తాను" అని అన్నారు.

అందుకు కుక్క "అన్ని రోజులు అరవటం(మొరగటం) నా వల్ల కాదు నాకు 10ఏళ్ళు చాలు, మిగితా 10ఏళ్ళు తిరిగి ఇచ్చేస్తాను" అంటుంది. దేవుడందుకు అంగీకరిస్తారు.

మూడవ రోజున దేవుడు కోతిని సృష్టించి "నీకు 20ఏళ్ళ జీవితాన్ని ప్రసాదిస్తాను.. నువ్వు నీ కోతి చేష్టలతో అందరినీ నవ్వించాలి" అని అంటారు.

అందుకా కోతి "20ఏళ్ళు కోతి చేష్టలు నా వల్ల కాదు ... కుక్క మీకు 10ఏళ్ళు ఇచ్చింది కదా నేను కూడా 10 ఏళ్ళు ఇస్తాను" అన్నది. దేవుడు సరేనన్నారు.

నాలుగవ రోజు దేవుడు మనిషిని సృష్టిస్తారు "తిను, తాగు, ఆడుకో , ఆనందంగా జీవించు నేను నీకు 20 ఏళ్ళ జీవితాన్ని ప్రసాదిస్తాను" అంటారు.

అందుకు మనిషి " ఏంటీ... ఒక్క ఇరవై ఏళ్ళేనా .... అవేమి సరిపోతాయి... నాకు నా 20తో పాటు ఆవు తిరిగిచ్చిన 40ఏళ్ళు, కుక్క ఇచ్చిన 10ఏళ్ళు, కోతి ఇచ్చిన 10ఏళ్ళు కలిపి 80ఏళ్ళు ఇచ్చేయండి" అని అడుగుతాడు.

దేవుడు అందుకు సరేనని అంగీకరిస్తారు.

అందుకే మనం మొదటి 20ఏళ్ళు ఆడుతూ, పాడుతూ ఏమీ చేయకుండా ఆనందంగా జీవిస్తాం.
తరువాతి 40ఏళ్ళు బానిసల లాగా కుటుంబం కోసం ఎండనకా వాననకా కష్టపడతాం.
తరువాతి పదేళ్ళు కోతి చేష్టలతో మనవళ్ళని, మనవరాళ్ళని ఆనందపరుస్తాము.
ఆఖరి పదేళ్ళు ఇంటి ముందు కూర్చుని వచ్చేపోయేవారి మీద అరుస్తూ ఉంటాము.

ఎవరు రాసారో కాని చాలా బాగుంది కదండీ.... ఎంత నిజం....

English Version కోసం ఇక్కడ చూడండి :  Hardworking Human Life


Thursday, November 29, 2012

మునిగిన టైటానిక్ ఓడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి... ?? వినండి...... మీకు సమయం ఉన్నప్పుడే....


నేను కొన్ని వారాల క్రితం ఈ వ్యాఖ్యానం విన్నాను...

నేనేమీ ఇస్కాన్ సాంప్రదాయం పాటించను..... అయినా నాకు ఇది బాగా నచ్చింది...

టైటానిక్ ఓడ మునిగిపోయింది..... బాధే కానీ,

మునకకు ముందు దానికి వచ్చిన హెచ్చరికలు ఏమిటి....??

మునిగిపోయిన ఓడ నుంచి మనం నేర్చుకోవలసినది ఏమిటి.....??


మీకు వీలునప్పుడు తప్పక వినండి...... మీ ఖాళీ సమయంలో కొంత దీనికి కేటాయించవలసినదిగా ప్రార్థన...



Wednesday, November 28, 2012

కాస్త ఈ పద్యం వినండి.......



చాలా రోజుల తరువాత కొన్ని మంచి పద్యాలు వినే భాగ్యం కలిగింది....

ఇదంతా బాలసుబ్రమణ్యం గారి 'పాడుతా తీయగా' వలనే.....

అందులో ప్రవీణ్ కుమార్ అనే అభ్యర్ధి పాడిన 'సత్య హరిశ్చంద్ర ' రంగస్థల నాటిక లోని పద్యము కంట తడి పెట్టించింది అంటే అతిశయోక్తి కాదేమో.....

(ఆ పద్యము క్రింద వీడియోలో 2:45ని దగ్గర మొదలవుతుంది....)

కాస్త మీరూ వినండి....


Friday, June 22, 2012

మిత్రుడి బ్లాగు : కవితలు - కల్పనలు



ఆ రోజెందుకో కాస్త తీరిక దొరికి స్నేహితులతో చాట్ చేస్తున్నాను..

నా స్నేహితుడొకరు ఆన్లైను లో కనబడి పలకరిస్తే మాట్లాడుతున్నాను.......

మాటల మధ్యలో సంధర్భం వచ్చి బ్లాగుల గురించి మాట్లాడుతుంటే తను కవితలు రాసేవారని చెప్పారు.....

నేనందుకు ఆశ్చర్యపోయి "అవునా...!! ఏది మీ బ్లాగు లంకె పంపండి" అని అడిగాను.

వారు రాసిన కవితలు చదివాక నాకెంతో ఆశ్చర్యం అనిపించింది ఇన్ని రోజుల పరిచయంలో ఒక్కసారి కూడా ఆ టాపిక్ మాట్లాడే సంధర్భమే రాలేదేంటా అని అనిపించింది.....

నేను ఎంతో మంది బ్లాగ్మిత్రులు రాసే బ్లాగు పోస్టులన్నీ బుక్ మార్క్ చేసుకొని మరీ చదువుతాను...
నా బ్లాగులో వారెవరి గురించీ ప్రస్తావించలేదు ఇంతవరకు..........  అలాంటిది ఈ రోజు ఈ టపా ఎందుకు రాస్తున్నాను అంటే.....

నా మిత్రుడు తన బలం తను తెలుసుకోలేని ఆంజనేయుడి లాగా ఉన్నారు....

మీ కవితలు ఎంతో బాగున్నాయి..... మీరు వ్రాయడం ఆపొద్దు..... మీ బ్లాగు కూడలి, జల్లెడలో పెడితే మీకు ఎంతో మంది కవి మిత్రులు సలహాలు, సూచనలు కామెంట్ల రూపంలో ఇస్తారు.... అని ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు....

నా మాటలు నమ్మడం లేదు... కాస్త మీరైనా చెబుదురూ....!!

మరి ఆ బ్లాగేది...?? లంకె ఎక్కడా అంటారా ................??

ఇదిగో ఇక్కడే.....



Wednesday, May 30, 2012

నా మంగళసూత్రము గట్టిది విషము పుచ్చుకోమని చెప్పిన పార్వతీ దేవి


ఈ మధ్యనే ఒకరి బ్లాగులో మంగళ సూత్ర ప్రాధాన్యత గురించి చదివాను...


ఆ తరువాతే చాగంటి గారి "మహేశ్వర వైభవం" ప్రవచనములో 17వ భాగము లో మొదటి 15 నిమిషాలలో ఈ పద్యము మరియు దీని యొక్క భావము  చెప్పగా విన్నాను.....


మ్రింగెడి వాడు విభుండని  
మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్....
మ్రింగమనె సర్వ మంగళ 
మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో...



పరమశివుడు హాలాహలము పుచ్చుకునేందుకు పార్వతీ దేవిని ఒప్పించిన సంధర్భం గురించి మరియు పార్వతీ దేవి శివుడిని హాలాహలము పుచ్చుకోమని చెప్తున్న సంధర్భం గురించి  చెప్తూ శుకబ్రహ్మ చెప్పిన పద్యము....

సంధర్భం ఏదైనా మంచి పద్యము కాబట్టి  బ్లాగ్మిత్రులతో పంచుకోవాలనిపించి ఇక్కడ రాసాను...


Wednesday, May 9, 2012

నా పిచ్చితనం....



ఏవీ ఆ చిటపట చినుకుల మాటున తడిచి ఎండిన బుజ్జి పాదాలు........
ఎక్కడా కనబడవే మనం ఆడి వదిలేసిన బొమ్మల కొలువులు......
ఎంత విందామన్నా వినబడవేమి అమ్మ పాడిన లాలి పాటలు.......
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సెలవలెక్కడా... ఎదురు రావే.....

ఏమైపోయింది నా పాల బుగ్గల పసిడి బాల్యం......
ఎంత వెతికినా కనబడదే  నా చిరుప్రాయం......
ఎటు వైపు చూసినా శూన్యం....

ఏవీ నా మనసులోయలో శిధిలమైన జ్ఞాపకాలు
తోటి వారితో ఆటలాడిన తీపి గురుతులు....
అమ్మ కట్టిన మిఠాయి పొట్లాలు......
అక్కతో నే పెట్టుకున్న పోట్లాటలు....

ఏమైపోయాయి ఇవన్నీ.....??

ఒక్కసారిగా కాలమనే ముసుగులో దాగి నన్ను ఆటపట్టిస్తున్నాయా............?
నాతో దోబూచులాడి నన్ను వాటి వెంట పరిగెత్తిస్తున్నాయా........?

మరి అదే నిజమైతే అవి ఎప్పుడో ఒకసారి ముసుగు తొలగించి నాకు ఎదురు పడాల్సిందే కదా...........!!
ఏదో ఒక క్షణాన ఆ దోబూచులాటలు కట్టిపెట్టల్సిందే కదా.........!!

వస్తుందా ఆ క్షణం...... ఆగుతుందా పరిగెత్తే కాలం...... అంతా నా పిచ్చితనం....



Friday, March 9, 2012

ఐతే....?? కాకపొతే....??


సుష్టుగా తింటే హ్యపీ.....
లేకుంటే బీ.పీ........

టాబ్లెట్ వేసుకుంటే వగరు......
వేసుకోపొతే షుగరూ....

ఎంతో రుచికరమైన సాసూ......
వేసుకుని తింటే గ్యాసూ.....

కమ్మనైన సేమియా పాయసం....
కాస్త ఎక్కువ తింటే ఆయాసం....

ఫేసుబుక్, జీమెయిలులో చాటు....
ఎక్కువసేపు చేస్తే తలపోటు....

కప్పు టీ విత్ సాసరూ......
2 కంటే ఎక్కువైతే అల్సరూ.....

వంటలో ఉప్పెక్కువైతే వారు....
కాకపొతే చేసింది మావారు...

ఎంత రాసినా తరగని కోడు.....
ఏమని చెప్పను సాఫ్టువేరు గోడు.....

అన్ని బ్లాగులూ చదవాలని ఆసక్తి.......
నా బ్లాగు చూస్తే విరక్తి.....


ఇష్టమైతే పలుకు 'హల్లో'........
లేకుంటే చమకు 'చల్లో'........

ఉన్నోడు తాగేది బీరు........
లేనోడు తాగేది నీరు.........


(ఇంకా ఉంది......)