Showing posts with label నరసరాజు. Show all posts
Showing posts with label నరసరాజు. Show all posts
Wednesday, May 19, 2010
త్పృవ్వట బాబా ..... లేఖినే సబబా..?
తెనాలి రామకృష్ణుడి "త్పృవ్వట బాబా " సమస్యను నేను కొంత వరకైనా పూరించాను అని చెప్పుకునే అర్హత కలిగించిన లేఖినికి నా హృదయపూర్వక నమస్కారములు.....
ఇక అసలు విషయానికి వస్తే .... ఈ సమస్య తెనాలి రామన్న ఎందుకు , ఎవరిని అడిగాడు....? వివరాల్లోకి వెళ్తే...
ఒక రోజు శ్రీకృష్ణదేవరాయలి కొలువుకి "సహస్ర ఘంట కవి నరసరాజు" వస్తాడు. ఇతనికి పట్టిన ఘంటం ఆపకుండా రాస్తాడని బాగా పేరు గలదు.
పరుల కవితలలో తప్పులు పడతాడని పేరు కూడా ఉంది.
తన విద్యను పరీక్షించి విజయ పత్రిక కటాక్షించమని శ్రీకృష్ణదేవరాయని అర్థిస్తాడు.
సరే అలాగే చూద్దాము, విద్యను ప్రదర్శించమంటాడు రాయలు.
ఇంతలో పెద్దన ఒక క్లిష్టమైన పద్యము వినిపిస్తాడు. నరస కవి పెద్దన చెప్పిన పద్యము రాస్తాడు
ఎవరికీ ఏమి అర్ధం కాలేదు....
ఇంత కష్టమైన పద్యాన్ని చాలా సునాయాసంగా రాసేసాడని అలోచిస్తుంటారు...
ఇంతలో మన తెనలి రామన్న లేచి ... ఏది ఈ పద్యం రాయండి చుద్దాం అంటూ ఇలా చెప్తాడు........ త్పృవ్వట బాబా .....
తల పై పువ్వట జాబిల్లి
వల్వ బూదెట ........... చేదే బువ్వట
చూడగ నుళుళుక్కవ్వట అరయంగనట్టి హరునకు జేజే...
నరస కవి ఘంటం ఒక్కసారిగా ఆగి పోయింది...
తెనాలి రాముడు ఆగ్రహం పట్టలేక "చెప్పిన పద్యమే రాయలేని వాడవు...... పెద్దన కవిత్వం లో తప్పులు పడతావా అంటూ..." ఇలా పద్య రూపం లో చివాట్లు పెడతాడు.
తెలియనివన్ని తప్పులని
దిట్ట తనాన సభాంతరమ్మునన్
పలుకగ రాదురోరి పలుమారు పిశాచపు పాడె గట్ట
నీ పలికిన నోట దుమ్ముబడ
భవ్యమెరుంగవు పెద్దలైన వార నిరసింతువా..
ప్రగడరాణ్ణరసా విరసా... తుసా..... భుసా...
దానితో నరస కవి తల వంచుకొని వెనుదిరుగుతాడు.
కాని మన రాయల వారు చేతికి ఎముక లేని దాత కదా ఆ కవి కి తగిన బహుమానం ఇచ్చి పంపిస్తాడు...
మరి నా బహుమతి ఎప్పుడు వస్తుందో...?
Subscribe to:
Posts (Atom)