Tuesday, January 26, 2010

నా తొలి కవిత
ఇది నేను రాసిన తొలి కవిత ........


నీకై తలచిన ప్రతి తలపు ఒక అక్షరమై
నా కలం లోంచి జాలువారగా.......

నిన్నే తలంచి రాసే ప్రతి మాట
ఒక కవితై వెల్లువించగా...........

నా గుండెల్లో నీకై దాగిన ప్రేమే
మన ఈ దూరాలను దూరం చేయగా ........

నేను వేసే ప్రతి అడుగు
మన ఇద్దరిని ఏకం చేయదా...!

ఆ క్షణం కోసమే ప్రతి క్షణం ఒక యుగం లాగా
ఎదురు చూస్తుంది నా ఎద.....!ఎలా ఉందండీ ఈ నా తొలి ప్రయత్నం ......?Wednesday, January 20, 2010

ప్రపంచము లోని 8 వింతైన పర్వతశ్రేణులు .....

8 of the Most Beautiful Mountains in the World

నేపాల్ దగ్గరి హిమాలయ పర్వతాల లోని అమ దబ్లం పర్వతము.8 of the Most Beautiful Mountains in the World

గర్వ్హల్ దగ్గరి 21,329 అడుగుల ఎత్తు గల శివలింగ పర్వతము

8 of the Most Beautiful Mountains in the World

శివలింగ పర్వతము కంటే 1500 అడుగుల ఎత్తులో గల "మచపుచరె" పర్వతము. దీనినే "ఫిష్ టెయిల్" అని కూడ అంటారట. దీనిని ఎవరూ అధిరొహించలేకపోవడం గమనార్హం.
8 of the Most Beautiful Mountains in the World

స్విస్ పర్వతశ్రేణుల్లోని "మత్తెర్హొర్న్" పర్వతము
8 of the Most Beautiful Mountains in the World

హిమాలయ పర్వతాల లోని "సెర్రొ చల్టెన్" పర్వతము8 of the Most Beautiful Mountains in the World
బొలివియ లొని "సజమ" పర్వతము. ఇది అగ్నిమండలము (Volcanic Ash) యొక్క బూడిద తో తయారైనది8 of the Most Beautiful Mountains in the World

కెనడియన్ రొకి పర్వతము .


8 of the Most Beautiful Mountains in the World


నేపాల్ - టిబెట్ బొర్డెర్ లోని "పుమొరి" పర్వతము. దీనికే 'Unmarried Daughter' అని మరియు " Everest's Daughter" అని పేరు.


ఇంకా వివరంగా English Version లో చూడండి.


Monday, January 18, 2010

ఇవి చూడండి....

శుభోదయం.....

కాసేపు ఇవి చూడండి....

Photobucket


  

Friday, January 15, 2010

ప్రపంచములోని 5 వింతైన బీచ్ ప్రదేశాలుప్రపంచములోని 5 వింతైన బీచ్ ప్రదేశాలని చుద్దామా....నల్ల రంగు ఇసుక బీచ్...... పునలూఉ బీచ్ - హవాయి


తెల్ల రంగు ఇసుక బీచ్.....హ్యంస్ బీచ్ - న్యూ సౌత్ వేల్స్ , ఆస్ట్రేలియా


పచ్చ రంగు ఇసుక బీచ్.........పపకొలే బీచ్ - హవాయి
తెలుపు మరియు పింక్ రంగు ఇసుక బీచ్........ప్ఫైఫ్ఫెర్ బీచ్ - కాలిఫోర్నియాఎర్ర రంగు ఇసుక బీచ్.........కైహలులు బీచ్ - మౌఇభలే బాగున్నాయి కదండీ.....

వీటి గురించి కాస్త ఎక్కువ వివరణ English Version లో చూడండి.


Wednesday, January 13, 2010

సంక్రాంతి శుభాకాంక్షలు ........ కొంత తెలుసుకుందామా..?


Photobucket


ముందుగా మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ....
సంక్రాంతి అనగానె గుర్తుకొచ్చేది హరిదాసు,గొబ్బిళ్ళు,పతంగులు ..... 
Photobucket

అసలు సంక్రాంతి అంటే... అంటూ మీకు లెక్చర్లు దంచకుండా
క్లుప్తంగా దాని విశిష్టత చెప్తాను

సూర్యుడు వెలుగునిచ్చెవాడే కాదండోయ్ మనం కొలిచే దైవం కుడా ....

సూర్యభగవానుడు ఒక సంవత్సర కాలంలో 12 రాశుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు.

ఆ సూర్యభగవానుడు ఒక రాశి నుండి మరొక రాశికి తిరిగడాన్ని " సంక్రమణం" అంటారు

సూర్యభగవానుడు ఆరు నెలలు దక్షిణ దిశగా కర్కాటక రాశి నుండి సింహ రాశి లోనికి ప్రవేశించే కాలాన్ని "దక్షిణ సంక్రమణం" అని మరియొక ఆరు నెలలు ఉత్తర దిశగా మకర రాశి నుండి మిథున రాశి లోనికి ప్రవేశించే కాలాన్ని "ఉత్తర సంక్రమణం" అని అంటారు.

మరి మన సూర్యభగవానుడు మకర రాశి లోనికి ప్రవేశించిన రొజునే మనం "మకర సంక్రాంతి " పండుగగా జరుపుకుంటున్నాం.


పండుగ రోజు కుడా ఎక్కువ చెప్పి విసిగించను...


మీరందరూ సంతొషంగా "సంక్రాంతి" ని
కనుల విందుగా "కనుమ" జరుపుకొవాలని ఆశిస్తూ .......

మరొక్క మారు మీకు, మీ కుటుంబసభ్యులకు,అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ....


మన పెద్ద వారి దీవెనలే మనకి కొండంత అండ  ......


Photobucket

Monday, January 11, 2010

కాసేపు నవ్వుకోండి .....


కొన్ని మంచి సూక్తులు..


చావడానికి 3 సులభ మార్గాలు...

దమ్ము కొట్టండి ................ 10 సం||లు ముందుగానే చస్తారు
రమ్ము కొట్టండి ................. 30 సం||లు ముందుగానే చస్తారు
స్వచ్ఛంగా ప్రేమించండి .... రోజూ చస్తారుమూర్ఖుడే ఆడవారిని నోరు మూసుకోమంటాడు.....
తెలివైన వాడు "నీ పెదవులు రెండూ కలిసి ఉంటే ఎంత అందంగా ఉంటావో తెలుసా " అంటాడు.


మందు కొట్టడం మానెయ్యటానికి 2 మంచి మార్గాలు ...

పెళ్ళికి ముందు....... నువ్వు బాధగా ఉన్నప్పుడే తాగు
పెళ్ళి తర్వాత......... నువ్వు సంతొషంగా ఉన్నప్పుడే తాగునీ స్నేహితుడిని ప్రేమించు.......... కాని అతని చెల్లెలిని కాదు
నీ చెల్లెలిని ప్రేమించు.............. కాని తన స్నేహితులను కాదు.ఒక వ్యక్తికి దేవుడు 2 వరాలు ప్రసాదించాడు....
అతడు సర్వోత్తమమైన మద్యము మరియు సర్వోత్తమమైన స్త్రీ ని ప్రసాదించమని కోరాడు...
అందుకు దేవుడు అతనికి.......
సర్వోత్తమమైన మద్యము మరియు మథెర్ థెరెసా ను ప్రసాదించాడు
కాబట్టి ... జాగ్రతగా మాట్లాడండి....
దేవుడైనా ఏం చేస్తాడు పాపం...

దీని ఆంగ్ల వెర్షను కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి English Version

Sunday, January 10, 2010

అమ్మ సలహా...


ఇది నేను ఎక్కడో చదివిందేనండి..
బాగుంది కదా అని ఇక్కడ రాసాను.....


ఈ కాలం పిల్లలకి ప్రతీ అమ్మా ఇచ్చే సలహా ఇది .......


అమ్మ తన కొడుకు తొ...
1960’స్ ............ ......... ......... ఒరేయ్ , మన కులం అమ్మాయినే పెళ్ళి చేసుకోరా .....


*
*
*
*

1970’స్…………………….. ఒరేయ్ , మన మతం అమ్మాయినే పెళ్ళి చేసుకోరా .....

*
*
*
*

1980’స్ ……………………. మన హోదా కి తగిన అమ్మాయినే పెళ్ళి చేసుకోరా .....

*
*
*
*

1990’స్ ……………………. మన దేశం అమ్మాయినే పెళ్ళి చేసుకోరా .....

*
*
*
*

2000 ……………………. నీ వయసు కి తగిన అమ్మాయినే పెళ్ళి చేసుకోరా .....

*
*
*
*

2010 ……………………. ఎవరైనా పర్లేదు కానీ అమ్మాయినే పెళ్ళి చేసుకోరా ….…..….. !!!


Friday, January 8, 2010

అనగనగా ఒక ఉడత ....... బొమ్మల కథ...
అనగనగా ఒక ఉడత .......
దానికెప్పుడూ మనుష్యుల మధ్య తిరగటం అంటే సరదా...

ఒక రోజు ఎవరికి చెప్పకుండా ఒక మనిషి వెంటపడి వెళ్ళిపోయింది...


కాని కాసేపటికే దానికి ఆకలేసింది .....
ఎవరికైనా బాగా ఆకలేస్తె మొదట అమ్మే కదండీ గుర్తుకొచ్చేది...
దానికి కుడా వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చింది .


దగ్గర్లో ఎవరో తాగి వదిలెసిన జ్యూస్ గ్లాస్ కనపడింది .... ప్రాణం లేచొచ్చినట్లయింది....
ఇంక అంతే ఒక్క ఉదుటున పరుగు తీసి గ్లాస్ అందుకుంది..... గట గటా తాగేసింది ఆ నాలుగు చుక్కలని...
అయినా ఆకలి తీరలేదు ...
ఎందుకు వచ్చానురా ఈ మనుష్యుల మధ్యలోకి అని దాని వెర్రితనానికి అదే లెంపలేసుకుంది....
మెల్లగా ఒక్కొక్కరుగా అమ్మా, నాన్న, స్నేహితులు గుర్తుకొచ్చారు ..


రోజు స్నేహితులతో కలిసి జాంపండ్లు దొంగిలించడం, సరదాగా ఆటలు ఆడుకొవడం గుర్తుకొచ్చాయి ....
అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది , మనుష్యుల మధ్యకు
వెళ్ళొదురా ఏ మత్తు మందొ పెట్టి ఎత్తుకెల్తారు అని
వింటేనా , ఇప్పుడు తెలిసొస్తుంది ...
ఇకనైనా బుద్ధిగా ఉండాలనుకొని , ఇంక ఆలస్యం చెయకూడదు అనుకుంది .వెంతనె పరుగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది.
తను చేసిన తప్పును క్షమించమని అడిగింది.


తల్లి మనసు కోప్పడుతూనే భొజనం పెట్టింది.
కడుపు నిండా తిని "ఇక నుండి బుద్ధిగా ఉంటానమ్మ " అని చెప్పింది .
ఇంకేముందండీ ......కథ కంచికి....... ఉడతింటికి.......

Thursday, January 7, 2010

నూతన సంవత్సర తీర్మానం

ఈ నూతన సంవత్సరం సందర్భంగా నేను ఒక తీర్మానం చెసుకున్నాను

ఏది ఏమైనా సరే
ప్రాజెక్ట్ వర్క్ లొ ఎన్ని డెడ్ లైన్లు ఉన్నా, ఎంత ఒత్తిడి ఉన్నా , ఎన్ని ఆటుపోట్లు ఉన్నా

...

నేను ఇదే స్పూర్తిని కలిగి ఉంటాను .....


....
.... ....
.... .... ....
.... .... .... ....
..... ...... ...... ......
ఆల్ ఈజ్ వెల్ .... ఆల్ ఈజ్ వెల్... ఆల్ ఈజ్ వెల్....

Monday, January 4, 2010

సూపర్ క్లిక్స్ ..... పట్టేసా... నా కెమెరాలో పెట్టేసా..ఇది ఒక ఆర్ట్ మ్యూజియం లోని ఫోటో .....


ఈ ఫోటో లో కార్ అనుకోకుండా వచ్చింది ....
కాని ఎంత బాగా కుదిరిందో కదా..


ఈ ఫోటో నేనే నిజంగా తీసాను ఎక్కడిదో వాల్ పేపర్ లాగా ఉంది కదూ.. .


ఇది నేను లాస్ ఏంజెల్స్ నుంచి వస్తున్నప్పుడు తీసిన ఫోటో.
కార్ ఏమో తొంభై మైళ్ళ స్పీడ్ లో పోతుంది ....

బాగుంది కదండీ...