
అనగనగా ఒక ఉడత .......
దానికెప్పుడూ మనుష్యుల మధ్య తిరగటం అంటే సరదా...

ఒక రోజు ఎవరికి చెప్పకుండా ఒక మనిషి వెంటపడి వెళ్ళిపోయింది...
కాని కాసేపటికే దానికి ఆకలేసింది .....
ఎవరికైనా బాగా ఆకలేస్తె మొదట అమ్మే కదండీ గుర్తుకొచ్చేది...
దానికి కుడా వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చింది .

దగ్గర్లో ఎవరో తాగి వదిలెసిన జ్యూస్ గ్లాస్ కనపడింది .... ప్రాణం లేచొచ్చినట్లయింది....
ఇంక అంతే ఒక్క ఉదుటున పరుగు తీసి గ్లాస్ అందుకుంది..... గట గటా తాగేసింది ఆ నాలుగు చుక్కలని...
అయినా ఆకలి తీరలేదు ...
ఎందుకు వచ్చానురా ఈ మనుష్యుల మధ్యలోకి అని దాని వెర్రితనానికి అదే లెంపలేసుకుంది....
మెల్లగా ఒక్కొక్కరుగా అమ్మా, నాన్న, స్నేహితులు గుర్తుకొచ్చారు ..

రోజు స్నేహితులతో కలిసి జాంపండ్లు దొంగిలించడం, సరదాగా ఆటలు ఆడుకొవడం గుర్తుకొచ్చాయి ....

అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది , మనుష్యుల మధ్యకు

వెళ్ళొదురా ఏ మత్తు మందొ పెట్టి ఎత్తుకెల్తారు అని
వింటేనా , ఇప్పుడు తెలిసొస్తుంది ...
ఇకనైనా బుద్ధిగా ఉండాలనుకొని , ఇంక ఆలస్యం చెయకూడదు అనుకుంది .

వెంతనె పరుగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పింది.
తను చేసిన తప్పును క్షమించమని అడిగింది.
తల్లి మనసు కోప్పడుతూనే భొజనం పెట్టింది.

కడుపు నిండా తిని "ఇక నుండి బుద్ధిగా ఉంటానమ్మ " అని చెప్పింది .
ఇంకేముందండీ ......
కథ కంచికి....... ఉడతింటికి.......
Super...
ReplyDeleteబాగుందండి.
ReplyDeleteCho chweet!
ReplyDeletegood story.
ReplyDeleteGood!!
ReplyDeletegood one
ReplyDeleteAnonymousగారు, Maruti గారు, Malakpet Rowdy గారు, అప్పారావు శాస్త్రిగారు,శిశిర గారు, anitha గారు థాంక్స్ అండి.....
ReplyDeleteCHAALA BAAGA VRAASAARU
ReplyDeleteudutha bommalu bagunnayi.nice collection
ReplyDeleteబామ్మ మాటే కాదు.. అమ్మ మాట కూడా బంగారు మూటే... కాదు కాదు జామకాయ మూట :)
ReplyDeleteMAHESH garu Thanks
ReplyDeleteAnonymous గారు - ఆ బొమ్మలే ఈ కథకి స్ఫూర్తినిచ్చాయి....
Rajగారు - :-)