Showing posts with label పండగ. Show all posts
Showing posts with label పండగ. Show all posts

Wednesday, December 22, 2010

క్రిస్టమస్ సెలవలు - తీపి గుర్తులు




క్రిస్టమస్ అనగానే  నాకు గుర్తుకొచ్చేవి సెలవలు.....



హఫ్-ఇయర్లీ పరీక్షలయ్యాక క్రిస్టమస్ పండగకి వచ్చే 10 రోజుల సెలవలు..... 
కొన్ని రొజుల వ్యవధితో సంక్రాంతి సెలవలు... ఇంకా కొన్ని రోజులు ఆగితే ఒక్క పూట బడులు... 
మరి కొన్ని రోజులకే సమ్మర్ హాలీడేస్.....

ఇలాగే గడిచిపోయింది బాల్యం...

మాది కాన్వెంటు స్కూలు కావటాన పరీక్షలు అయిపొయాక ఆఖరి రోజున స్కూల్లో క్రిస్టమస్ పండుగ మీద స్కిట్  చేసి చూపించేవారు..

చిన్న పిల్లలం కదా... అది ఎప్పుడు అయిపొతుందా ఎప్పుడెప్పుడు ఇంటికి వెల్దామా అని అనిపించేది...

కానీ మా టీచర్లేమొ 10 రోజులకు సరిపడా హోంవర్క్ ఇచ్చేవాళ్ళు అంతా రాత పనే...

మనమెమో రెండో రొజే అమ్మమ్మ దగ్గరికి తుర్రుమనేవాళ్ళం...

మళ్ళీ సోమవారం స్కూలనగా శనివారం ఇంటికి వచ్చేవాళ్ళం....

తీసుకెళ్ళడానికి అన్ని పుస్తకాలు అమ్మమ్మ దగ్గరికి తీసుకెళ్ళినా ఒక్కటీ తెరిచిన పాపాన పోము...

ఇక అమ్మే ఒక లెక్చరరు అనుకోండీ మా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండీ..

బడిత పూజ ఖాయం.....

ఆ హొంవర్కులేమో ఎంత రాసినా పెన్నులు అరిగి పోవలసిందే కాని అవి అయిపోయి చావవు...

సొషలు టీచర్ ఏమొ మేమెదో పెద్ద గొప్ప కొలంబస్ లమైనట్లు...... తెలియను మాపులన్నీ చెప్పి... అవి కొని దేశాలు,  వాటి రాజధానులు అన్నీ రాసుకు రమ్మనేది...

మనకేమొ ఆ అట్లాసు అంతా తిరగేసినా ఆమె చెప్పిన కొన్ని పేర్లు దొరకవు... మన అట్లాసు కూడా ఏ అక్కదో , అన్నయ్యదో ఐతే అందులో కొత్త దేశాలు కనపడవు... ఇక చూడండి తంటా.. స్కూలుకెళ్ళంగానే స్నేహితులందరిని నీకు దొరికిందా అంటే నీకు దొరికిందా అని మాపు పట్టుకు తిరుగుతాం...

సొషలు ఒక్కటే కాదు అన్నింటిలోను ఒక్కొక్క తంటా...
చెప్పుకుంటూ పొతే పండగ వాతావరణం ఉండదంటా...

అందుకే .... ఇక్కడితో ఈ నా రాత ఆపి... చెబుతున్నా మీ అందరికీ
క్రిస్టమస్ శుభాకాంక్షలంటా...

        
  MERRY CHRISTMAS FRIENDS...........