Monday, November 30, 2009

అనుకోకుండా బుద్ధుడి గుడిలో.....

ఆ రోజు సాయంత్రం ఆఫీసు నుంచి త్వరగా వచ్చాను........,
ఎటూ త్వరగా వచ్చాను కదా...... అని ఇంటికి దగ్గర లోని గుడికి వెళ్ళి దేవుడి దర్శనము చేసుకొని, కాసేపు ప్రశాంతముగా ధ్యానం చేసుకొని....... ఏదో ఈ దేవుడు ఉండబట్టే  మనము ఇలా ఉన్నామేమొ కదా అనుకుంటూ బయటికి వచ్చా.

ఎలాగూ ఇంత దూరము వచ్చాము కదా పక్కనే  బుద్ధుడి గుడి ఉంది అది కూడా చూద్దాము ఎలా ఉంటుందో అని సహజ కుతూహలం తో లొపలికి అడుగు పెట్టా.ఎవరో నా దగ్గరికి వచ్చి వాళ్ళ భాషలో ఏదో అడిగారు నాకు ఏమి చెయ్యటానికి తోచింది కాదు అలాగే బెల్లం కొట్టిన రాయి లాగా నిలుచుండిపోయాను.

తర్వాత వాళ్ళలొ ఒకావిడ వచ్చి ఆంగ్లములో "ఎందుకు వచ్చావు....?" అంది.
" దేవుడిని చూద్దాము,పూజ చేసుకుందాము అని వచ్చాను" అని చెప్పా.

ఇంక అంతేనండి ఏదొ పెద్ద గొప్ప వ్యక్తి వచ్చినట్లు సంతొషించి నన్ను పైకి తీస్కొని వెళ్ళింది. అక్కడేమొ అందరు పెద్ద వాళ్ళే,తనే రుసుము చెల్లించి నా పూర్తి పేరు అడిగి ఎందులొనో రాయించింది.ఆ రాసిన ఆవిడెమో పేరు పలకడం రాక దాన్ని నానా చండాలము చేసి పెడుతూ ఇలాగేనా పలికేది నాకు కావాలి చెప్పు చెప్పు అంటుంది.

 ఎలాగైతేనేమి అతి కష్టం మీద నా పేరు పలికించాను.హమ్మయ్య ఇంక చాలురా దేవుడా నిన్ను చూడటానికి వస్తే నన్ను నేను కోల్పేయేట్టు ఉన్నాను ఈ అయోమయములొ అని అనుకొని వెళ్ళబోతుంటే "తిన్నావా తింటావా? " అని మళ్ళి మొదలు "వద్దు నేనేమి తినను" అని చెప్పాను.

"సరే  అయితే 5 నిమిషాలు కూర్చొ వచ్చి పూజ చేస్తారు" అన్నారు.

ఎవరు వస్తారో అని 10 నిమిషాలు కూర్చుని చూద్దును కదా అతను ఒక చర్చ్ ఫాథర్ లాగ ఉన్నారు.ఎవరైతే ఏమి పూజ కోసం వచ్చాం చెస్కొని,వెళ్ళిపొతే అయిపోతుంది అని అనుకున్నాను.

నన్ను ఒక 10 నిమిషాలు నిలబెట్టి,ఒక ఇద్దరితో పూజ చేయించారు.మధ్య మధ్య లొ ఏవో  మంత్రాలు చెప్పి నన్ను వంగి వంగి దండం పెట్టమన్నారు అలాగే చేసాను. తర్వాత నన్ను తీస్కొచ్చిన అమ్మాయి ఇంకొక అమ్మాయి కలిసి మళ్ళీ పూజ చేసారు. నేను నిలుచొనే వారు పెట్టమని అన్నప్పుడల్లా వంగి వంగి నమస్కరించాను ఇంక  అయిపోయింది బయటపడదాములే అనుకున్నా కాని అక్కడే ఉందండి అసలు విషయం.ఇప్పుడు పూజ చెయ్యాల్సింది నేనే అట.వారు నలుగురు నన్ను దేవుడుకి పరిచయము చేసారంట.సరే అని నా చేత ఏవేవో మంత్రాలు చెప్పించారు,ఏ 50-60 సార్లో  వంగాను అంతా అయ్యాక "ధన్యవాధములు , ధన్యవాధములు " అన్నారు.

నాకు " అనుకోకుండా ఒక రోజు"  సినిమా గుర్తొచ్చిందండి,ఏంటో వీళ్ళు అని.

నాకు ఒక చిన్న బుక్ లో నా పేరు నాతో పాటు పూజ చెసిన వారి పేర్లు రాసి ఇచ్చారు.అదంతా చైనీసు లొనే ఉంది,ఏమి అర్దం కాలేదు నా  పేరు తప్ప.

ఇంక అందరికీ ధన్యవాదములు చెప్పి బయటికి వస్తుంటే ఆపి ఒక బోర్డ్ ముందు కూర్చొబెట్టి ఏవో పాఠాలు చెప్పారు,అదొక 15 నిమిషాలు.

ఆఖరున ఎలాగో అలా బయటికి వచ్చాను.ఇక అంతేనండి మళ్ళి వెనక్కి తిరిగి కూడా చూడలేదు,అలాగే  వచ్చేసా...

కాకపోతే దగ్గర్లోనే చైనీసు గుడి కూడా ఉందండోయ్ మీరేమంటారు???????

7 comments:

  1. ఇక "అనుకోకుండా చైనీసు గుడిలో" టపా ని కూడా రాసేయండి..:):)

    ReplyDelete
  2. "అనుకోకుండా బుద్ధుడి గుడిలో" awesome madam!!! you reminded same situation I had :-)

    ReplyDelete
  3. చక్కగా చైనీసు గుడికి కూడా వెళ్లి.. ఇక్కడ ఇచ్చిన పుస్తకాన్ని అక్కడ చూపించి ఏం రాసారు అని అడగండి... :)

    ReplyDelete
  4. తృష్ణ గారు :-) :-)


    మీకు నచ్చినందుకు ధన్యవాథములు...

    అజ్ఞాతలందరికీ థాంక్స్ అండీ...

    Raj గారు
    ఇంకా నయ్యం .... నేను బ్లాగు రాయడానికి ఉండేదాన్నో లేదో....
    మా దగ్గరికి రాకుండా అటు వెల్లావా.... అని ఏమేమంటారో

    నిజం చెప్పాలంటే.... తర్వాత ఒక రోజు ధైర్యం చేసి వెళ్ళానండీ కానీ అక్కడ ఇలాంటివేవీ ఎదురవలేదు...

    ReplyDelete