Wednesday, April 14, 2010
ప్రేమను తెలపండి...
పవన్ 3వ తరగతి చదువుతున్నాడు. వాడికి స్కూలుకెళ్ళడం అన్నా , పాఠాలు చదవడం అన్నా గిట్టదు.
వాళ్ళ అమ్మ ఎప్పుడూ వాడిని బడికి వెళ్ళమని తరుముతుందని అమ్మంటే కోపం.
సెలువలు వచ్చినప్పుడు అమ్మ చేసే మిఠాయిలు, తాయిలాలు అంటే మాత్రం మహా ఇష్టం.
ఏదో ఒక సాకు చెప్పి బడి ఎగ్గొట్టడం , తప్పని సరైతే బడికి వెళ్ళడం ఇలా అటూ ఇటుగా 10వ తరగతి గట్టెక్కాడు.
హమ్మయ్య ఇక బడికి వెళ్ళే పని లేదులే అనుకుంటుండగానే కాలేజీలు మొదలు
రోజూ పొద్దున్నే లేపే అమ్మని చూస్తే చిరాకు .
వద్దన్నా వినకుండా టిఫిన్ బాక్సు పెడుతుందని కోపం, దానితో అమ్మని అరిచేవాడు.
పాపం తల్లికి కొడుకు ఆకలి తెలుస్తుంది కాని ఆడపిల్లల ముందు బాక్సు పట్టుకుంటే కొడుక్కి నామోషీ అని తెలియదు కదా!
పరీక్షలు దగ్గరపడుతున్నాయి చదువుకోరా అని తల్లి చెబితే అది మహా పాపం
అదే ఏ స్నేహితుడో వచ్చి అరే చదువుకుందామారా అంటే మాత్రం తుర్రుమనేవాడు.
ఏదో ఒక రకంగా చదువుకొవడమేగా కావాలి అనుకునేది తల్లి.
ఇలా అలా మెల్లెగా తల్లి అంటే గౌరవం కాస్తా పోయి కొపం,చిరాకు,చులకన మొదలయ్యాయి.....
అలా అని అమ్మంటే ప్రేమ లేక కాదు , అమ్మ వేషభాషలు నచ్చక.
స్నేహితుల అమ్మలతో పోలిస్తే తన అమ్మ తక్కువగా, ఫాషను తెలియనిదిగా , పాతకాలపు మనిషి గా కనిపిస్తుంది అతడికి.
ఇతగాడి ఇంటర్ పూర్తయి ఇంజనీరింగు లో చేరేసరికి అమ్మ మరి కాస్త ముసలిదయింది.
ఇంక అమ్మ అంటే నిర్లక్ష్యం మొదలయ్యింది. తను చదివేది చాలా గొప్ప చదువని , తనకి తెలిసినంతగా ఎవరికీ తెలియదనే భావన పెరిగింది.
సహజంగా మనం ఎవరైనా కొత్త వారిని పరిచయం చేసుకున్నప్పుడు లెదా మనకు తెలిసిన వాళ్ళతో ఉన్నప్పుడు మనమే గొప్ప అనే భావనతో ఉంటాము , ఒకవేళ వారు మనకంటే గొప్ప అని తెలిసినా ఒప్పుకోలేము ,ఒప్పుకోము(ఇక తప్పనిసరైతే తప్ప).
మన పవన్ విషయానికి వస్తే అదే జరిగింది....... అమ్మని లక్ష్య పెట్టడం మానేసాడు.
మెల్లగా చదువు పూర్తయ్యి ఉద్యొగం లో చేరాడు.ఇంతలో అమ్మకి ఆరొగ్యం మందగించింది.
అమ్మని తన దగ్గరికి తెచ్చుకున్నాడు,మంచి వైద్యం చేయించాడు.
ఉద్యొగంలో స్థిరపడ్డాక ఒక చక్కటి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకున్నాడు అమ్మ సలహాతోనె......
భార్య వచ్చాక పరిస్థితులు కాస్త మారాయి..
అమ్మతో ప్రవర్తించినట్లే భార్యతో ప్రవర్తిస్తే ఊరుకుంటుందా...?
మెల్లగా ఆలోచన మొదలయ్యింది.
భార్య ఏది పెడితే అదే తినాలి,అమ్మైతే తనకి ఏది ఇష్టమో అదే పెట్టేది.
తను ఎలా ఉండమంటే అలా ఉండటం, తనకి ఇష్టమైన బట్టలే వేసుకొవడం ఇలా అలా ఎన్నొ చేస్తుంటే అమ్మ విలువ తెలుస్తోంది అప్పుడప్పుడే .
కాలం ఎవరి కోసము ఆగదు కదండీ, 3 ఏళ్ళు తిరగ్గానే మరో బుల్లి పవన్ చేరాడు ఆ ఇంట్లోకి...
ఇక కేరింతలు , తుళ్ళింతలతో సాఫీగా సాగుతుంది జీవనం.......
అమ్మ ఉందిగా వాడిని చూసుకోవడానికి ఇంక దిగులెందుకు అనుకున్నాడే కానీ అమ్మ ఆరొగ్యం కూడా మందగిస్తుందన్న సంగతి గుర్తించలేక పోయాడు.
మెల్లగా వాడు పెద్దవాడు కాసాగాడు... స్కూలు మొదలయ్యింది....
పవన్ కి తన బాల్యం గుర్తుకొచ్చింది... స్కూలుకెళ్ళమని తరిమే అమ్మ.... బడి ఎగ్గొట్టడం ... చిలిపి జ్ఞాపకాలు...
రోజూ స్కూలుకి వెళ్ళమని వెంటపడే తండ్రిని చూస్తే చిరాకు వీడికి....
పవన్ నవ్వుకున్నాడు.... అచ్చు తండ్రి పోలికలే అని మురిసిపోయాడు...
మెల్లగా పిల్లవాడు పెద్దవాడయ్యడు.... ఈ కాలం పిల్లలు ఎలా ఉంటారో తెలుసు కదండీ..
తల్లిదండ్రులు అంటే ఏమి తెలియనివారు, అవసరాలు తీర్చేవారు, అనవసరంగా అనుమానించేవారు, ఏదైనా ప్రాణం మీదికి వస్తే ఖచ్చితంగా చూసుకునేవారు, ఇంకా చెప్పాలంటే పిల్లల 24* 7 సపోర్టులు..
ఇదే విధమైన ఆలొచనలతో పెరుగుతున్నాడు మన బుల్లి పవన్.
తండ్రి అంటే తనకి కావలిసినవి అందిస్తూ, అనవసర విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండవలసినవాడు అని ఇతడి భావన.
పవన్ కి కొడుకంటే అమితమైన ప్రేమ.ఏది అడిగినా లేదనకుండా కొనిచ్చేవాడు....
తను ఎన్ని ఇబ్బందులు పడుతున్నా కొడుక్కి మాత్రం తెలియనిచ్చేవాడు కాదు.
భార్య ఎంత చెప్పినా వినకుండా కొడుకుని గారాబం చేస్తూ పెంచసాగాడు.
ఆ విలువ కొడుక్కి ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి....
తన తల్లి మరి కాస్తా ముసలిదయ్యి ఏ పనికి అక్కరకు రాకుండా పొయిందని భార్య చేసే చిరాకు భరించరానిదయ్యింది.
ఇదిలా ఉండగా కొడుకు ఇంజినీరింగు చదువు మొదలయ్యింది....ఆ ఫీజులు కట్టేసరికి తడిసి మోపెడయ్యింది.
ఒక రోజు కొడుకు తండ్రి దగ్గరికి వచ్చి తనకి టిఫిన్ బాక్సు పట్టుకెళ్ళడం ఇష్టం లేదని , కాలేజీ క్యాంటీను లో తినడానికి నెలవారీగా ఇవ్వాలని చెప్పాడు.
పుత్ర రత్నం కదా , సరేనని నవ్వుకొని అలాగే కానిమ్మన్నడు....
ఇంత వరకూ బాగానే ఉంది... తండ్రి ఒక రోజెందుకో కాలేజీ కి వెళ్ళినందుకు ఆ రోజు ఇంట్లో 3వ ప్రపంచ యుద్ధమే మొదలయ్యింది...
తండ్రి చాలా ఓల్డు ఫాషను వాడని, ఒక డొక్కు స్కూటరు వేసుకుని కాలేజీకి వచ్చాడని...
స్నేహితుల ముందు తన పరువు తీసాడని... ఇకముందెన్నడైనా ఇలా జరిగితే తనింక ఊరుకునేది లేదని ఖచ్చితంగా తెగేసి చెప్పేసాడు....
ఇదంతా చూసిన పవన్ తల్లి మనవడు కొడుకుని తన ముందు అలా తిట్టడం తట్టుకోలేకపొయింది.... ఆ ఆలొచనలతోనే పడుకుంది.....
పవన్ కి అస్సలేమీ అంతు పట్టట్లేదు... జరిగినదాంట్లో తన తప్పేమిటో అర్ధం కాలేదు...ఎందుకో ఆ రాత్రి నిద్ర పట్టదం లేదతడికి...
మెల్లగా తన చిన్ననాటి జ్ఞాపకాలు ఒక్కొక్కటిగా కమ్ముకున్నాయి...
డాబాపైకి వెళ్ళి కుర్చీలో కూర్చుని ఆలోచించసాగాడు ...... ఈ రోజు ఇన్ని ఇచ్చి దేనికి లోటు రానివ్వకుండా పెంచిన కొడుకు ఇలా అన్ని మాటలంతుంటే అతడు తన తల్లి ఎడల ప్రవర్తించిన తీరు గుర్తుకువచ్చింది....
తన తల్లి తన కోసం ఎన్ని కస్తాలు పడిఉంతుందో తెలిసొచ్చింది..
ఇన్ని రోజులైనా అమ్మని ఏనాడు సరిగ్గా చూసుకోలేదే అని బాధేసింది
అమ్మ యెడల తనకున్న ప్రేమ ఆప్యాయతలను ఏనాడు తెలియబరచని తన వెర్రితనానికి సిగ్గేసింది...
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అమ్మని తను ఎంత నిర్లక్ష్యం చేసాడొ అర్ధం అయ్యింది...
ఇన్నాల్టికి అమ్మ విలువ తెలిసొచ్చింది.... ప్రొద్దునే అమ్మ దగ్గరికి వెళ్ళి క్షమార్పణలు చెప్పుకొని, అమ్మ ఒడిలో తలవాల్చి నిద్రపోదామనుకున్నాడు...
తను తన అమ్మ యెడల ప్రవర్తించిన తీరే కొడుకుది అని తెలుసుకుని... ముందు తనను తాను సరిదిద్దుకుని కొడుక్కి గుణపాఠం చెప్పాలనుకున్నాడు... ఈ ఆలోచనలతో కుర్చీలొనే కునుకు పట్టింది.
అప్పుడే తెలవారుతుంది.. పక్షుల కిలకిలారావలతో, దూరాన గుడిలో విస్ను సహస్ర నామ స్తొత్రము తో మెలకువ వచ్చింది...
వెంటనే తన తల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకున్నాడు...
డాబా మెట్లు దిగి కిందికి వచ్చాడు..
ఇళ్ళంతా నిశబ్దం.. భార్య వంటింట్లో కాఫీ పెడుతుందీ..
రోజు ఈ పాటికి లేచి, జపమాలతో అష్టొత్తరాలు చదివే అమ్మ ఎక్కడా కనబడలేదు అతడికి..
మెల్లిగా అమ్మ ఉండే గది తలుపులు తెరిచాడు.. దగ్గరగా వెళ్ళి " అమ్మా... అమ్మా.." అని పిలిచాడు.
ఎంతో ఆత్రుతగా తన భావాలను వ్యక్త పరచాలని ఎదురుచూస్తుంది మనసు.
ఎంతకీ కదలని అమ్మని చూస్తే అర్ధమయ్యింది.... తన భావాలను, మనస్సులోని మాటలను చెప్పాలనుకునే సరికే ఇంతా ఘోరమూ జరిగిపొయింది...
తన గుండెలోని మాట నోటి దగ్గరే ఆగిపోయింది... ఇన్నాళ్ళుగా తనని ఎంతగానో ప్రేమించిన అమ్మ చచ్చిపోయింది....
తన గుండెలోని మాటలు తన అమ్మ ఆత్మ తెలుసుకునేనా...?
తన కొడుక్కి తన విలువ ఎప్పటికైనా తెలిసేనా...?
మనం అత్యంత ప్రేమిస్తున్న మనుషులకి ఆ విషయాన్ని ఎప్పటికైనా చెప్పగలిగే వీలున్నా చెప్పగలిగామా....?
ఇకనైనా మేలుకుందాము మనకు ఇష్టమైన వారియెడల మనకున్న ప్రేమను తెలియజేద్దాం.
The greatest weakness of most humans is their hesitancy to tell others how much they love them while they're alive.
-- Orlando A. Battista
Subscribe to:
Post Comments (Atom)
చాలా చక్కగా రాసారు!!
ReplyDeleteVery nice story. Naku chala nachindhi.
ReplyDeleteచాలా బాగుందండి. అబినందనలు.
ReplyDeleteచాలా బావుందండీ, మంచి మాటని హృద్యంగా చెప్పారు !
ReplyDeletegood story...Thanks for posting...
ReplyDeleteMaruti గారు, rajeswari గారు , Anonymous గారు , sowmya గారు , Ravi Kumar గారు ధన్యవాదములు .....
ReplyDeleteGUndenu pindesaru ....
ReplyDelete