Sunday, April 3, 2011

ఉగాది పండుగ గురించి నాకు తెలిసిన కొంత ......

అసలు ఉగాది అంటే....
అంటూ మొదలుపెట్టి మిమ్మల్ని ఇబ్బందులలో పడవేయకుండా..... యుగాది పండుగ గురించి నాకు తెలిసిన కొంత మీకూ చెబుతాను....


ఇప్పటికే ఈ పండుగ గురించి చాలా మంది చెప్పి ఉన్న కారణాన, నేను అత్యవసరమైనవి.... వారు చెప్పని 4 మాటలు మాత్రం చెప్పదలిచాను...


యుగాది నూతన సంవత్సరానికి నాంది పలుకుతుంది..... వసంత ఋతువుతో మన ఇంట సుఖ సంతోషాలను నింపుతుంది...
యుగాది అంటే యుగానికి ఆది అని చెప్పుకోవచ్చు......


త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవుడు ఈ రోజునే సృష్టి ని మొదలుపెట్టి ,భూమిని,కాలాలను,రోజులను,నెలలను, పగలురాతురులనూ,ఋతువులను,సంవత్సరాలనూ సృష్టించారని మన శాస్త్రము చెబుతున్నది.........


రామాయణ కాలములో ఉత్తరాయణము మొదలైన మొదటి రోజున ఉగాది జరుపుకునేవారట......... అంటే చైత్రము ఆఖరి నెల అన్నమాట.


6వ శతాబ్దములో వరాహమిహిర మహర్షి నూతన సంవత్సరమును చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునేలా మార్చారు......


ఆ విధంగా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు మనము ఉగాది పండుగ జరుపుకుంటున్నాం....


మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఈ పండుగ సంధర్భంగా ఉగాది శుభాకాంక్షలు చెబుతూ..... అందరికీ ఈ సంవత్సరం.... కొత్త వెలుగు జిలుగులిస్తూ... ఆనందమయంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.......

4 comments:

  1. ధన్యవాథములు......ఉగాది శుభాకాంక్షలు
    మీ ఊసులు బాగున్నాయి...

    ReplyDelete
  2. "రామాయణ కాలములో ఉత్తరాయణము మొదలైన మొదటి రోజున ఉగాది జరుపుకునేవారట......... అంటే చైత్రము ఆఖరి నెల అన్నమాట."
    సంక్రాంతి నాడు ఉత్తరాయణం మొదలు అవుతుంది.
    జూలై 16-17 లలో ఉత్తరాయణం చివరి రోజు.

    సూర్యుడు మకరం కుంభం మీనం మేషం వృషభం మిధునం ఈ ఆరు రాశులందు ఉండటం ఉత్తరాయణం.
    ఏప్రిల్ 14-15 నుండి సూర్యుడు మేషం లో ఉంటాడు.
    సాయన సిద్ధాంతం ప్రకారం మార్చ 21 నుండి సూర్యుడు మేషం లో ఉంటాడు.

    ReplyDelete
  3. సాధారణ పౌరుడు గారు.......... మీరు చెప్పినదీ నిజమే.....
    రామాయణ కాలములో ఉత్తరాయణము మొదలైన మొదటి రోజున ఉగాది జరుపుకునే వారని కొంత మంది పెద్దలు చెప్పినది....
    నేను చెప్పినది కాదు.......

    సంక్రాంతి పండుగ గురించి నేను రాసిన బ్లాగులో చూడగలరు......

    http://yoursmaddy.blogspot.com/2010/01/blog-post_13.html

    ReplyDelete
  4. good one maddy......

    ReplyDelete