Wednesday, May 30, 2012

నా మంగళసూత్రము గట్టిది విషము పుచ్చుకోమని చెప్పిన పార్వతీ దేవి


ఈ మధ్యనే ఒకరి బ్లాగులో మంగళ సూత్ర ప్రాధాన్యత గురించి చదివాను...


ఆ తరువాతే చాగంటి గారి "మహేశ్వర వైభవం" ప్రవచనములో 17వ భాగము లో మొదటి 15 నిమిషాలలో ఈ పద్యము మరియు దీని యొక్క భావము  చెప్పగా విన్నాను.....


మ్రింగెడి వాడు విభుండని  
మ్రింగెడిది గరళమనియు మేలని ప్రజకున్....
మ్రింగమనె సర్వ మంగళ 
మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో...



పరమశివుడు హాలాహలము పుచ్చుకునేందుకు పార్వతీ దేవిని ఒప్పించిన సంధర్భం గురించి మరియు పార్వతీ దేవి శివుడిని హాలాహలము పుచ్చుకోమని చెప్తున్న సంధర్భం గురించి  చెప్తూ శుకబ్రహ్మ చెప్పిన పద్యము....

సంధర్భం ఏదైనా మంచి పద్యము కాబట్టి  బ్లాగ్మిత్రులతో పంచుకోవాలనిపించి ఇక్కడ రాసాను...


Wednesday, May 9, 2012

నా పిచ్చితనం....



ఏవీ ఆ చిటపట చినుకుల మాటున తడిచి ఎండిన బుజ్జి పాదాలు........
ఎక్కడా కనబడవే మనం ఆడి వదిలేసిన బొమ్మల కొలువులు......
ఎంత విందామన్నా వినబడవేమి అమ్మ పాడిన లాలి పాటలు.......
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సెలవలెక్కడా... ఎదురు రావే.....

ఏమైపోయింది నా పాల బుగ్గల పసిడి బాల్యం......
ఎంత వెతికినా కనబడదే  నా చిరుప్రాయం......
ఎటు వైపు చూసినా శూన్యం....

ఏవీ నా మనసులోయలో శిధిలమైన జ్ఞాపకాలు
తోటి వారితో ఆటలాడిన తీపి గురుతులు....
అమ్మ కట్టిన మిఠాయి పొట్లాలు......
అక్కతో నే పెట్టుకున్న పోట్లాటలు....

ఏమైపోయాయి ఇవన్నీ.....??

ఒక్కసారిగా కాలమనే ముసుగులో దాగి నన్ను ఆటపట్టిస్తున్నాయా............?
నాతో దోబూచులాడి నన్ను వాటి వెంట పరిగెత్తిస్తున్నాయా........?

మరి అదే నిజమైతే అవి ఎప్పుడో ఒకసారి ముసుగు తొలగించి నాకు ఎదురు పడాల్సిందే కదా...........!!
ఏదో ఒక క్షణాన ఆ దోబూచులాటలు కట్టిపెట్టల్సిందే కదా.........!!

వస్తుందా ఆ క్షణం...... ఆగుతుందా పరిగెత్తే కాలం...... అంతా నా పిచ్చితనం....