Wednesday, May 9, 2012

నా పిచ్చితనం....



ఏవీ ఆ చిటపట చినుకుల మాటున తడిచి ఎండిన బుజ్జి పాదాలు........
ఎక్కడా కనబడవే మనం ఆడి వదిలేసిన బొమ్మల కొలువులు......
ఎంత విందామన్నా వినబడవేమి అమ్మ పాడిన లాలి పాటలు.......
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సెలవలెక్కడా... ఎదురు రావే.....

ఏమైపోయింది నా పాల బుగ్గల పసిడి బాల్యం......
ఎంత వెతికినా కనబడదే  నా చిరుప్రాయం......
ఎటు వైపు చూసినా శూన్యం....

ఏవీ నా మనసులోయలో శిధిలమైన జ్ఞాపకాలు
తోటి వారితో ఆటలాడిన తీపి గురుతులు....
అమ్మ కట్టిన మిఠాయి పొట్లాలు......
అక్కతో నే పెట్టుకున్న పోట్లాటలు....

ఏమైపోయాయి ఇవన్నీ.....??

ఒక్కసారిగా కాలమనే ముసుగులో దాగి నన్ను ఆటపట్టిస్తున్నాయా............?
నాతో దోబూచులాడి నన్ను వాటి వెంట పరిగెత్తిస్తున్నాయా........?

మరి అదే నిజమైతే అవి ఎప్పుడో ఒకసారి ముసుగు తొలగించి నాకు ఎదురు పడాల్సిందే కదా...........!!
ఏదో ఒక క్షణాన ఆ దోబూచులాటలు కట్టిపెట్టల్సిందే కదా.........!!

వస్తుందా ఆ క్షణం...... ఆగుతుందా పరిగెత్తే కాలం...... అంతా నా పిచ్చితనం....



21 comments:

  1. బాగుంది...జీవితంలో పోయినదేదీ తిరిగి రాదు, ఇక బాల్యం ఎలా వస్తుంది, నిజమే అంతా పిచ్చితనమే!

    ReplyDelete
    Replies
    1. చిన్ని ఆశ గారు అంతే కదండీ.... రాదు కదా...

      Delete
  2. మన దృష్టి మార్చుకుంటే...మన కళ్ళెదురుగానే కనపడుతుందా ప్రాయం...

    ReplyDelete
    Replies
    1. బాగా చెప్పారండీ జ్యోతిర్మయిగారు ..... కానీ జ్ఞాపకాల పొరలలోనుంచి రావడానికి తటపటాయిస్తుంది...

      Delete
  3. '' ఉందో లేదో స్వర్గం
    నా పుణ్యం నాకిచ్చెయ్
    నా సర్వస్వం నీకిస్తా
    నాబాల్యం నాకిచ్చెయ్ ''
    రెంటాల గీతం --గజల్ శ్రీనివాస్ పాడగా విన్నాను
    మీరు అదే అన్నారు

    నేనంటాను ....
    బాల్యం బంగరు స్వప్నం
    అరిషడ్వర్గం దరిచేరని దుర్గం
    ఎన్ని కోట్లు వెచ్చించినా
    తిరిగిరాని స్వర్గం ...
    మధురమైన మీ కవితకి అభినందనం

    ReplyDelete
    Replies
    1. చాలా చాలా బాగుందండీ మీ కవిత... నా పోస్టుకి మీరు ఈ విధంగా స్పందిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది..

      Delete
  4. బాగా చెప్పారు. .... ఇప్పుడంతా ఎండమావుల వెంట పరిగెత్తే బాల్యమే.

    ReplyDelete
  5. అబ్బా ఎంత చక్కగా రాసారో.....చిన్న చిన్న మాటల్లో ఎంత భావం పలికించారండీ......
    నిజమే బాల్యం ఇక తిరిగిరాదు.... బాల్యమే కాదు... గడిచిన ఒక్క క్షణంకూడా తిరిగిరాదు.. ఏం చేస్తాం.....

    ReplyDelete
    Replies
    1. సాయి భరద్వాజ్ గారు : రాదు కాబట్టే ఈ బాధంతా... మీకు నచ్చినందుకు సంతోషంగా ఉందండీ..

      Delete
  6. jarigi poyinadedi tirigi raadu kada jnaapakaale manaku migiledi....baagaa raasaru

    ReplyDelete
    Replies
    1. avunandi... thanks for your comment and I am glad you liked my post :-)

      Delete
  7. really great, me bhavanala alochanalaku na abhinandhana

    ReplyDelete
  8. ఆగదూ ఆగదూ.. ఆగితే సాగదు ఈ లోకమూ......బాగా చెప్పేరు

    ReplyDelete