Tuesday, December 15, 2009

నేనో కథ రాశానొచ్

"నేనో కథ రాశానొచ్" అని ఎగిరి గంతెయ్యలని ఉంది.కాని ఇంట్లొ మా ఆవిడ ఉంది వింటే అట్లకాడ తిరగేస్తుంది.నెమ్మదిగా లోపలికివెళ్ళి "ఏమోయ్ ఏం చేస్తున్నావ్" అని అడిగా. "ఉండండి కాఫీ తెస్తున్నా" అంది
ఏమిటీ విచిత్రం ఎప్పుడూలెనిది నా భార్య ఇంత చక్కగా సమాధానం చెప్పిందేంటా అని అలోచిస్తూ నేను రాసిన కథనుమా ఆవిడకువినిపిద్దామనుకున్నా.ఇంతలోనే మా ఆవిడ రెండు కాఫీ కప్పులు పట్టుకుని వచ్చింది.

"ఏమిటోయ్! ఇవాళ నాతో కలిసి కాఫీ తాగుతున్నావా? ఏంటి సంగతి భార్యామణి గారికి....."
" ... అంతలేదు కానీ మళ్ళీ 2 సారి కాఫీ తీసుకురమ్మనప్పుడు లేచి వెళ్ళి తేలేక ఇప్పుడే పట్టుకొచ్చా" అంది.
ఆశ్చర్యపోవడం నా వంతైంది.
"ఇంతకీ ఎందుకిందాక అలా అరిచారు, చేతిలో పేపర్లేంటి?" అని అడిగింది.
చెబుదామా? "మీ మొహానికి అదొక్కటే తక్కువ " అంటూ ఎక్కడ మీద పడుతుందో,
ఆగుదామా? "మీరీమధ్య నా దగ్గర చాలా దాస్తున్నారు " అంటూ ముక్కు చీదుతుందేమో అని ఆలొచిస్తూ ఆగిపొయా.
ఇంతలో "కాఫీ చల్లారితే మాత్రం నేను వేడి చేసి తీసుకురాను. ఎలాగో రెండవ కాఫీ చల్లగా తాగాలిగా మొదటిదైనా వేడిగాతాగండి" అంది.
సరేలెమ్మని కాఫీ తాగుతూ ఆమెవైపు చూసాను 'ఏంటి సంగతి ? ఏంటా పరధ్యానం, ఏముందా పేపర్లొ?" అన్నట్లుగాచూస్తుంది నాభార్య నా వంక .
ఏమీలేదన్నట్లుగా తలూపాను.కానీ నా మనసెందుకో చెప్పమని పదె పదె వేధిస్తుంది.
ఇలా కాదనుకుని " ఏమిలేదొయ్ ! నేను ... నేను.... అది .... మరీ... నేను...."
" మీరు మీరే . మీరివాళ నాకెలాగైనా చెప్తారు, నాకు తెలుసు. త్వరగా చెప్పండి అవతల నేను వంట చెయ్యాలి" అందిచెప్పకపొతేచంపుతా అన్నట్లు చూస్తూ .
ఇహ లాభం లేదనుకొని గుండె ధిటవు చేసుకొని " నేనో కథ రాశానోయ్" అని గట్టిగా కళ్ళు మూసుకున్నాను.
నా భార్య గట్టిగా నవ్వి " అంతేనా?" అంటుందనుకున్నా కానీ సీరియస్ గా చూస్తుంది 'తర్వత ఏంటి?" అన్నట్లుగా.
"మరీ..... నా కథ మొదట నీకే వినిపిద్దామని పిలిచాను ... అంతే " అన్నా
వెంటనే కూర్చుని " చెప్పండి" అంది
నాకు నా కథ అన్ని పత్రికలలోను ఒకే రోజు అచ్చయినంత ఆనందమేసింది నా భార్యా మాట అంటే.

"ప్రశాంతంగా వినాలి. ఆఖరున తప్పులు చెప్పు. కథ బాగా అర్ధం చెసుకో. ఎక్కడైనా అర్ధం కాకపొతే వెంటనే అడుగు.ప్లీజ్! కథఅయ్యెదాక లేచి వెళ్ళిపొకే" అన్నాను.
" సోది ఆపి కథ చెప్పండి" అంది విసుగ్గా.

"అనగనగనా ......... ఒక ... ఇలా కాదు కానీ నా కథ అర్ధం కావాలంటే ముందు నేను రాసిన కవిత అర్ధం కావాలి"
"...! సర్లే అదే చెప్పండి. ఇంతకీ మీరు రాసిందేంటి కథా , కవితా? " అని అడిగింది.
"రెండూ రాసాను. ముందిది విను" అని ఇలా చెప్పసాగాను.

"కాగితంతో పూలు చేసి
నీ పాదాల వద్ద ఉంచుదామనుకున్నా.....!"

"ఏంటీ కాగితంతో పూలు చేస్తారా? కాగితంతో పూలేంటండీ...."
"అది అంతే లేవే , కవిత్వం "
"సరే.. ఒక కాగితంతో ఎన్ని పూలు చేస్తారు?"
".. అవును కరక్టే.. ఒక నిమిషం ఉండు " అని ఒక కాగితం తెచ్చా. కానీ కాగితంతో పూలు చేయడం నాకు రాదే? నాభార్యకి చెప్తేపరువు పొతుందని కాగితాన్ని పరీక్షించినట్లుగా చూసి "... 10 చేస్తా " అన్నాను.
"ఒహో ! సర్లెండి , కాగితపు పూలు పది తయారు చేసి కాళ్ళ వద్ద పెడతారన్నమాట , సరే తర్వాత "
"పెట్టనే, అనుకున్నా అంతే , కవిత్వం....!"
"సరే... సరే.. తర్వాత"

"కాగితంతో పూలు చేసి
నీ పాదాల వద్ద ఉంచుదామనుకున్నా.....!
విమానపు రెక్కలు విరిచి
నీ పక్కలో పరుద్దామనుకున్నా.....!"

"హా ... హా... విమానపు రెక్కలా.......! మీకు ఎగరటం వచ్చా అదే ప్యారచూట్ వేసుకుని"
"రాదు. ఎందుకలా అడిగావ్...?"
"ఏమిలేదండీ ..... విమానపు రెక్కలు విరవాలంటే ఆకాశంలోకి ఎగరాలి కదా ..!"
"అబ్బా నెను ఏమైనా పిచ్చివాణ్ణా .... విమానం టేకాఫ్ కాకముందే రన్ వే దగ్గరికి వెళ్ళి విరుస్తా..."
"హా.. హా... హా... సరేలేండి మీ బడాయి, అప్పుడుగాని మీకు 7సం||లు జైలు నాకు 8సం||లు విశ్రాంతి" అంది
"అదేంటి నాకు 7సం||లు జైలైతే నీకు 8సం||లు విశ్రాంతి ఎందుకు ?"
"ఎలాగో జైల్లో గడిపి గడిపి ఇంట్లో కూడా జైల్లో ఉన్నట్లు ఫీలవుతారు కదా. మీరు తేరుకునేసరికి ఎలాగు 1 సం||పడుతుంది. అందుకేనాకు 8సం||లు విశ్రాంతన్నమాట"
"వామ్మో ఎంత దూరం అలోచించావ్. పోనిలే విమానపు రెక్కలు విరవకుండా(విమానాన్నే) నీ పక్కలో పరుస్తా "
"పొనిలేండి .....! తర్వాతేంటో?"

"కాగితంతో పూలు చేసి
నీ పాదాల వద్ద ఉంచుదామనుకున్నా.....!
విమానపు రెక్కలు విరవకుండా విమానాన్నే
నీ పక్కలో పరుద్దామనుకున్నా.....!
నడిరేయిలో నక్క కూసింది ....!"

"నడిరేయిలో చందమామో , వెన్నెలనో రాయవచ్చు కదా నక్క కూతలేంటండీ"
"అదంతే లేవే .... కవిత్వం !"
"అవునూ మనముండేది సిటీలో కదా నక్కను ఎక్కడినుంచి తెస్తారు. దానికి జంతు సంరక్షణ అధికారులుసమ్మతించొద్దూ?"

"అబ్బా....! నీకు బుర్ర బాగానే పని చేస్తుందోయ్ తప్పులు వెతకడంలో ముందుంటావ్ . సరేలే "నడిరేయిలో వెన్నెలవీచింది " అనిరాస్తానులే".

"తర్వాత... ? మళ్ళీ మొదట్నుంచి చదవకండి ప్లీజ్."

" సరేలెవే
నడిరేయిలొ వెన్నెల వీచింది
దెబ్బతో నా నిద్ర జారుకుంది"

"వెన్నెల వీస్తే నిద్ర జారుకోవడమేమిటండీ మీరు నిద్రలోకి జారుకోవాలి కానీ ..?" అని అడిగింది.

"మరదేమరి నక్క కూస్తే నిద్రెలా పడుతుందే ...... నువ్వేగా మార్చమన్నావు. అయినా ఇవన్నీ అనుకోవడమేకవిత్వమే..."

నా భార్యకి ఏమనిపించిందో నాకు తెలీదండీ కానీ ఒక్క ఉదుటున లేచి

"నేను వంట చేసి మీకు పెడదామనుకున్నా
కానీ "కాళరాత్రి" వచ్చింది మనసాగనంది "
అంటూ రుసరుసగా టి.వి . వైపు కదిలింది భార్యామణి .

16 comments:

  1. Oho baagundi , antey ee rojulalo adoluu kavitvam chadavadam aapi media antey adey TV cinemalu mida ekkuva craze chooputunnaru .

    ReplyDelete
  2. భలే ఉందండీ సరదాగా !!

    ReplyDelete
  3. భలే సరదాగా రాశారండీ. చాలా బాగుంది.
    ఇంతకీ 'నేనో కవిత రాశానోచ్.!' అనకుండా 'నేనో కథ రాశానోచ్' అన్నారేంటండీ .!? ;)

    ReplyDelete
  4. Anonymous గారు , జాన్‌హైడ్ కనుమూరి గారు, Maruti గారు ధన్యవాధములు ...

    మధురవాణి గారు చాలా చాలా థాంక్స్ అండీ...
    మరి కామెడీ ఉండాలి కదండీ ....

    ReplyDelete
  5. chaala bagundi.happyga anipinchindi.

    ReplyDelete
  6. బాగుంది.. నాకు కూడా నవ్వోచ్చింది....

    ReplyDelete
  7. Kumari గారు :-) :-)

    మీకు నచ్చినందుకు ధన్యవాథములు

    డేవిడ్ గారు
    థాంక్స్ అండీ...

    Pavan గారు థాంక్స్ అండీ........

    Hazarath Mannam గారు : Thanks a lot :-)

    ReplyDelete