Sunday, May 30, 2010

అయినావారికి విలువనివ్వు....


Don't Let Somebody Become a Priority in your life,
When you are just an option in their life....

ఈ వాక్యాలు చదవగానే నాకు ఈ టపా రాయాలి అనిపించింది......
ఈ విధంగా అయినా నేను నాలాంటి నలుగురిని మేలుకొలపగలననే ధైర్యంతో రాస్తున్నాను....

ఎదుటి వారి జీవితంలో మనం ఒక ఎంపికే అయినప్పుడు
వారు మన జీవితంలో భాగం కాకుండా చూసుకో అని దీని  భావన...

ఇది నూటికి నూరుపాళ్ళు నిజం.....
దానికి నిలువెత్తు ఉదాహరణ నేనే.....

నా చిన్నప్పుడు నేను మా అమ్మానాన్నల దగ్గర పెరగలేదు....
చాలా ఏళ్ళు.... బహుశా నా ఇంజినీరింగు అప్పుడు ఇంట్లో ఉన్నట్టున్నాను.....

అందువల్లనో ఏమొనండీ నేను వారి యెడల సఖ్యతతో ఉండేదాన్ని కాదు..
గౌరవం మాత్రం ఉండేది... పెద్ద వారు అని అంతే... అంతకు మించి ఏమి లేదు....
నాకు మా అమ్మ అంటే ఇష్టం ఉన్నా కూడా... ఎందుకో నేను తనకి విలువ ఇచ్చే విషయంలో ఎక్కడో పొరపాటు చెసాననుకుంటా..
కావాలనో, కుర్రతనమో తెలీదు కానిండీ.... మా అమ్మ ముందే వెరే వారికి ( పక్కింటి ఆంటీలకి) విలువ ఇచ్చేదాన్నీ
మా నాన్న గారి సంగతి చెప్పనే అక్కర్లేదండీ... అస్సలు వారిని నేను పట్టించుకున్నదే తక్కువ...
ఇది అవసరం అంటే ఆ పని చేయడం... అక్కడి నుంచి తుర్రుమనడం... అంతే... అంతవరకే....

ఇంజినీరింగు 2 సం||ము కల్లా మా అమ్మకూ నాకూ మధ్య స్నేహం మొదలయ్యిందండీ.......
రోజూ తన ఆఫీసు లో జరిగినవి తనూ, నా కాలేజీ విశేషాలు నేను చెప్పుకుంటూ సాయంత్రాలు గడిపేవారము...
అప్పుడప్పుడూ నేను ఇచ్చే సలహాలు అమ్మకి మంచి పేరు తెచ్చిపెట్టేవి.... అమ్మ ఏంతో సంతోషించేది....


అలా ... ఇలా... ఈ స్నేహం బాగా బలపడిపోయాక ఒక రోజు పాత జ్ఞాపకాలు తవ్వుకున్నప్పుడు....
మా అమ్మ చెప్పిన కొన్ని మాటలు... నేను జీవితంలో ఎప్పుడూ... మరిచిపోలేను.....
నేను మా అమ్మను లెక్క చేయనప్పుడు మా అమ్మ ఎంత బాధపడిందీ... తన ముందే వేరే వారికి, వారి మాటలకి విలువ ఇవ్వడం, వేరేవారిని మెప్పించడం కోసం తనని తక్కువ చేయటం ... తనని ఎంతగా బాధ పెట్టాయో చెప్పిందండీ...

ఆ రోజు నాకు కన్నీళ్ళు ఆగలేదండీ...... జీవితంలో ఎంత పెద్ద పొరపాటు చేసానో అర్ధం అయ్యింది.....
అమ్మ మనస్సు ఎంత బాధపడి ఉంటుందో తెలుసుకున్నాను.... ఇంకెప్పుడూ అలాంటి తప్పు చెయ్యకూడదూ అని నిర్ణయించుకున్నాను... 
నాన్న గారికి కొంత దగ్గరయ్యి తనకు కావలిసినవి తెలుసుకుని ముందే తెచ్చి పెట్టడం లాంటివి చాలా చేసాను.. అందుకు ఒకింత తృప్తే ఉన్నా... అమ్మ లాగా నాన్నని కూడా పూర్తిగా అర్ధం చేసుకునేలోపే నాకు ఆ అవకాశం ఇవ్వకుండానే ఆయన నాకు దూరమయ్యరు....

అప్పుడు నేను నిర్ణయించుకున్నను... జీవితం లో నా అని నేను అనుకున్న అందరికీ విలువనిస్తాను....
ఎప్పుడూ నావాళ్ళు అనుకున్నవాళ్ళని ఎదుటివారి ముందు తక్కువ చేసి చూడను... ఎదుటి వారిని సంతోషపెట్టడం కోసం అయినవారిని బాధపెట్టను అనిI will not try to please others by degrading my people.....
I will not give importance to others for our 5 minutes benifit...


The people we all meet will exist only upto 10 days in our entire 60 year life...
I will not use my 10 days to waste my 60years life....

Never try to over-show that you are more interested in others... This may really hurt your dear ones...
This may even cause a big damage...


 ఇప్పుడు మా అమ్మ మాటే నాకు వేదవాక్కని వేరే చెప్పక్కర్లేదనుకుంటా..

6 comments:

 1. పెద్దలు మన మధ్యే నడుస్తున్నప్పుడు వారి విలువ మనకి ఎంతమాత్రంతెలియదు సుమండీ .మీ confessions అర్ధవంతంగా ఉన్నాయ్ /జయదేవ్-చెన్నై-౧౭

  ReplyDelete
 2. When I am growing up, I too didn't give importance to my parents. Now, in my 40s, I feel very bad about it but at least I am glad that I realized it now and told my apologies to my living mother.

  My life changed for better after started listening to Sri Chaganti gari pravachamulu.

  I believe that the quote is not correct(Don't Let Somebody Become a Priority in your life,
  When you are just an option in their life.) As per Sri Chaganti garu, Dharmam depends on your actions. It will not depend on others' actions. It's dharmam to respect your parents. But whether your parents respect you or not is immaterial. Lord Sri Rama respected his father when he tried to give the kingdom to him or when he couldn't later due to Kaikeyi's wishes. Same way, he respected Kaikeyi even after she sent him to forest.

  It's great characteristic to behave according to Dharma although it's very hard to do and doesn't fetch benefits in the short term.

  ReplyDelete
  Replies
  1. నిజమేనండి... మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు......

   ఆ quote అన్ని వేళలా అన్ని విషయాలకు వర్తించదు అని తెలుసుకున్నాను

   Delete