Friday, August 26, 2011

ఆమె కథ -1                                         సుమారు 50 సం||లు ఉంటాయి ఆమెకి.వృద్ధాప్యపు ఛాయలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి.అలాగని ఆమెది కృతిమ సౌందర్యం కాదు.చక్కటి మేని ఛాయ ఏ దేవతో తన అందాన్ని ఈమెకి ధారాదత్తం చేసిందా అన్నట్టుగా ఉంది ఆమె అందం.ఈ అందానికి తోడు ఆమెలోని మంచితనం, సహృదయం వంటి సుగుణాలు ఆమెకు వన్నె తెచ్చాయి.వయస్సు మీద పడినా చాదస్తపు ఛాయలు కనబడుటలేదు.కానీ ఆమె మనస్సు ఏ మాత్రం ఆనందంగా ఉంది అనేది ఎవరికీ తెలియని విషయం.

                                         ఆమె అందరికీ కావాలి, కానీ ఎవరికీ ఆమె అక్కరలేదు. ఇదేంటీ చిత్రంగా ఉందే అనుకుంటున్నారా! అదే మరి అర్ధం కావల్సిన విషయం.ఆమె అందరికీ కావాలి అంటే ప్రొద్దున లేచినది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరికీ ఆమె అవసరం ఖచ్చితంగా ఉంటుంది.ఎవరికీ ఆమె అక్కర్లేదు అంటే ఆమె ఆనందంగా ఉందా, ఏమైనా తింటున్నదా లెదా? అనే విషయాలు ఎవరికీ పట్టవు.మనవలు మనవరాళ్ళతో ఆడుకుంటూ కాలం గడపాల్సిన వయస్సు.కానీ ఎవరికీ కాకుండా ఒంటరిగా ఎక్కడో మారుమూల పల్లెలో ఇలా గడపాల్సి వస్తుంది జీవితం.ఆమె ఏనాడు అనుకొని ఉండదు ఈ రోజున ఇలాంటి జీవితం గడపాల్సి వస్తుందని.  

                         ఏంటీ! ఎంతసేపటికీ ఆమె,ఆమె జీవితం,ఆమె బాధ అంటూ సాగదీస్తావు ఇంతకీ ఏమిటి "ఆమె కథ" అంటారా వినండి చెప్తా.

                                            ఆమె పేరు "భువన".ఆమె పుట్టిన 6సం||లుకే తండ్రి చనిపోయాడు.అక్కచెల్లెలు అన్నదమ్ములు ఎందరు ఉన్నా ఆమె ఎవరికీ ఏమి కానిది ఎందుకంటే ఆమె పుట్టిన తరువాతే వారింట దరిద్రలక్ష్మి తాండవిస్తుందని వారి భావన.వీరికి తినడానికి తిండి,కట్టుకొవతానికి బట్టా, విలాసాలకు రొక్కము మొ|| వాటికి ఏ మాత్రం కొదువ లేకపొయినా, ఆమె పుట్టిన దగ్గరినుండి తండ్రి వారిని సరిగా దగ్గరకు రానివ్వకపోవటం,ముద్దులాడకపోవటం, చేతిఖర్చులకు సొమ్ములివ్వకపొవటం వారికి నచ్చేది కాదు.అందుకే ఆమె అంటే వారికి ఇష్టం ఉండెడిది కాదు.    
                                                    తండ్రి చనిపోయిన దగ్గరనుంచి మొదలయినవి ఆమె కష్టాలు.ఎవరూ ఆమెతో మాట్లాడెడి వారు కాదు,ఆటలాడేవారు కాదు.కనీసం దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు.చెల్లి,తమ్ముడు ఉన్నను ఆమెను అంతగా పట్టించుకునేవారు కాదు.ఇక తల్లి సంగతి సరేసరి."నువ్వు పుట్టినప్పటి నుంచే కదే మాకు ఈ కష్టాలు" అంటూ రోజుకు ఒకసారన్నా తిట్టేది.ఇదిలా ఉంటుండగా కాలచక్రం ఆమె కోసం ఆగకుండా పరుగులెడుతూ,నీకంటే నేనే ముందంటూ 20సం||లు వద్ద ఒక్కసారి ఆగింది.ఇప్పుడామెకు 26సం||లు అంటే యుక్తవయస్కురాలు అన్నమాట.ఏదో విధంగా ఆమెకు వదిలించుకోదలచి తల్లి ఆమె అన్నలతో చేరి అతి తక్కువ కట్నం తీసుకునేవాడికిచ్చి కట్టబెట్టింది.

                                                     హమ్మయ్య పోనీలే ఇకనైనా సుఖపడుతుంది అనుకుంటున్నారేమో కాస్త అక్కడ ఆగి ఇది చదవండి అతడు చక్కనివాడే కానీ చిక్కనివాడు ,చిక్కులు కొనితెచ్చువాడున్ను.అంటే రోజుకో రకంగా ఇంటికి వచ్చువాడు.ఒకరోజు త్రాగి వస్తే,మరొక రోజు అప్పులవారిని వెంట తెచ్చువాడు.ఒకరోజు పేకాటరాయుళ్ళతో వస్తే మరియొక రోజు పడతితో వచ్చేడి వాడు. విధి ఆడిన వింత నాటకానికి తను బలిపశువు అయిందా అన్నట్లు ఆమెకు 32ఏళ్ళు రాగానే ఇద్దరు పిల్లలు చదువుకు వచ్చారు. పెద్దవాడికి 1వ తరగతి పుస్తకాలు కొనాలి. చిన్నదాన్ని బడిలో వెయ్యాలి కానీ ఇవేమీ పట్టవు ఆ జల్సారాయుడికి. అలాంటి వాడికి పిల్లలెందుకు అంటారా! అన్ని రోజులూ వాడి దగ్గర డబ్బు ఉండదు కదా, డబ్బులేనినాడు పడతులు వచ్చేవారు కాదు, వాడి సుఖం కోసం ఆమెనే పడతిగా తలచెడివాడు. ఆ గుర్తులే ఈ పిల్లలు.

1 comment:

  1. kashtaalu.kannelu unte gurthuku vasthai.comedy scenes rasthe chadavochchu.

    ReplyDelete