తెలుగు భాషను మర్చిపోతున్నామా....
ఏంటీ........................... ఇంతమంది తెలుగువారు నడుంకట్టి బ్లాగులు రాస్తుంటే......
ఏంతోమంది తెలుగువారు చక్కగా తెలుగు మాట్లాడుతుంటే.....
చాలామంది తెలుగు రాయటం , చదవటం నేర్చుకుంటుంటే ....
ఇలా చెప్పుకుంటూ పోవచ్చు గానీ.... మేమంతా వెర్రివాళ్ళమా ఏమి.... నీ ఇష్టమొచ్చినట్లు అనడానికి.....
అని నన్ను తిట్టిపోయకండి.........
నేను చెప్పేది ఏంటంటే..... మారుతున్న కాలంతో పాటు మనలో మార్పు సంతరించుకుంది...
అన్నిటిని మెల్లమెల్లగా మన సుఖానికి తగ్గట్టు మార్చేసుకుంటున్నాము.....
కొన్ని మన సౌకర్యాలకు తగ్గట్టు వాడేసుకుంటున్నాము.......
అలాంటి వాటిల్లో ఒకటే ఈ మన ప్రియమైన "తెలుగు" భాష అని నా అభిప్రాయం....
ఇది తప్పయ్యుండొచ్చు కూడా.....కానీ మరి నాకు తోచింది చెప్పాలి/రాయాలి కదా.... ఆ ప్రయత్నమే చేస్తున్నాను....
అసలిదంతా ఇప్పుడెందుకు గుర్తొచ్చిందటా..... అంటారా....
ఏమీ లేదండీ.... ఈ మధ్యనే "పిల్ల జమిందార్" సినిమా చూసాను....
దాని ప్రభావం లేండి....... అంటే అదేదో నన్ను మార్చేసిందని కాదు....
అందులో మాష్టారి పాత్ర వేసిన యం.ఎస్.నారాయణ గారి "తెలుగు చచ్చిపొతే ....." డైలాగు నా మనసులో గింగిరాలు గింగిరాలు తిరిగేసి.... ఇలా నా చేత వ్రాయిస్తుంది...
అలోచిస్తే.... మెల్లమెల్లగా తెలుగు తన అస్థిత్వాన్ని కోల్పోతుందేమో అని భయం వేస్తుంది....
ఇది వరకటి రోజుల్లో ఎంత స్వచ్చమైన తెలుగు మాట్లాడుకునేవారం.....
చక్కగా "అమ్మా..! అన్నం పెట్టు.... ఆకలేస్తుంది" అని అడిగే రోజులు పోయాయి...
(నేను ఇంకా అలాగే అడుగుతాను/అంటాను అని పోట్లాటకి దిగకండి... ఇక్కడ మీ ప్రసక్తి ఎత్తలేదు... ఈసారికి ఇలా వదిలెయ్యండి)
ఇదివరకటి రోజుల్లో వార్తలు ప్రారంభించే ముందు "నమస్కారం... వార్తలు చదువుతున్నది XXX (శాంతి స్వరూప్) ముందుగా ముఖ్యాంశాలు" అని మొదలు పెట్టే వారు
(ఆ ముఖ్యాంశాలు అనేది కూడా తర్వాత్తర్వాత వచ్చిందే అంటారా...... సరే అలాక్కానీయండి...)
మరి ఇప్పుడో "Welcome to Morning News/Mid-Night News This is so and so.... ముందుగా Headlines"
ఏ తెలుగులోనే కదా చెప్పాలి వార్తలన్నీ ..... మరి ఆ నాలుగు ముక్కలు కూడా తెలుగులోనే ఏడవచ్చు కదా....
అయిపోగానే "This is XXX signing-off"
ఇప్పటి దాకా ఏ భూ-అంతరిక్ష గ్రహాల ఒప్పందాన్ని Sign చేసావు నాయనా...
చక్కగా "ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం....!" ఎటు పోయింది నీ సంస్కారం...
అలా అని నేను ఇంగ్లీషు భాషను ద్వేషించట్లేదు/దుమ్మెత్తిపోయట్లేదు.......
అమ్మలాంటి తెలుగు భాష అవహేళనకు గురి అవుతుంటే నిరసన తెలియజేస్తున్నాను....
ఆ సినిమాలో మాష్టారుగారు చెప్పినట్టు దెబ్బతగిలితే shit అని అశుద్ధం నొట్లో వేసుకునే వారికి అమ్మ లాంటి తెలుగు విలువ ఎలా తెలుస్తుంది చెప్పండి...
ఏవీ ఆ వీరి వీరి గుమ్మడిపండ్లు..... ఎక్కడా వినిపించవే ఆ యుగళ గీతాలు....
ఇదివరకు ఎవరైనా కనిపిస్తే పెద్దవారైతే నమస్కారం పెట్టి..... ఆ తరువాత బాగున్నారా ....? భోజనం చేసారా... ? అని అడిగేవారం....
అదే ఈ రోజు ఎదురయ్యారనుకోండి ఎంత పెద్దవారైనా.... "హల్లో అండీ హౌ ఆర్ యూ లంచ్ అయ్యిందా....?" అని మొదలు......
అలా అని లేచిందే మొదలు శుభోదయం....అంటూ ప్రతాపము చూపించేసి గ్రాంధీకం వాడనక్కరలేదు...
కనీసం కొన్ని విషయాలలో అయినా నియమంగా పాటిస్తే బాగుంటుందేమో.....
మా పిల్లలు పీజ్జాలు, బర్గర్లే తింటారమ్మా అని సాగదీసే తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఈ మమ్మీ డాడీల పీడింపు తప్పదేమో....
అలా అని మరీ విపరీత ఆలోచనలతో గోడ కాగితాలు (Wallpapers)...... కిటికీలు(Windows).... అంటూ రాసినా కాసేపు నవ్వొస్తుందేమో కానీ... మాట్లాడుకోవడానికి బాగోదు.....
టీ, కాఫీలను ఎలాగో తేనీయము,పానీయము అంటూ పిలవలేము కదా..... మరి అనగలిగిన , మాట్లాడగలిగిన వాటిని ఖూనీ ఎందుకు చేయడం అనేదే నా ప్రశ్న...........
ఇలా చెప్పుకుంటూ పొతే చాంతాడంత అయ్యేట్టు ఉంది...... కుదిరితే ఇంకో టపాలో
నా గోడు వెళ్ళబోసుకుంటాను.....
ఇప్పటికి ఉంటాను ................
ఏమిటీ చూస్తున్నారు టాటాలు బై బై లూ గట్రా అంటాననా.....
ఇంతా రాసి ఆఖరున నన్ను నేనే గొయ్యి తీసి పాతేసుకుంటానా చెప్పండి......