ఏంటీ........................... ఇంతమంది తెలుగువారు నడుంకట్టి బ్లాగులు రాస్తుంటే......
ఏంతోమంది తెలుగువారు చక్కగా తెలుగు మాట్లాడుతుంటే.....
చాలామంది తెలుగు రాయటం , చదవటం నేర్చుకుంటుంటే ....
ఇలా చెప్పుకుంటూ పోవచ్చు గానీ.... మేమంతా వెర్రివాళ్ళమా ఏమి.... నీ ఇష్టమొచ్చినట్లు అనడానికి.....
అని నన్ను తిట్టిపోయకండి.........
నేను చెప్పేది ఏంటంటే..... మారుతున్న కాలంతో పాటు మనలో మార్పు సంతరించుకుంది...
అన్నిటిని మెల్లమెల్లగా మన సుఖానికి తగ్గట్టు మార్చేసుకుంటున్నాము.....
కొన్ని మన సౌకర్యాలకు తగ్గట్టు వాడేసుకుంటున్నాము.......
అలాంటి వాటిల్లో ఒకటే ఈ మన ప్రియమైన "తెలుగు" భాష అని నా అభిప్రాయం....
ఇది తప్పయ్యుండొచ్చు కూడా.....కానీ మరి నాకు తోచింది చెప్పాలి/రాయాలి కదా.... ఆ ప్రయత్నమే చేస్తున్నాను....
అసలిదంతా ఇప్పుడెందుకు గుర్తొచ్చిందటా..... అంటారా....
ఏమీ లేదండీ.... ఈ మధ్యనే "పిల్ల జమిందార్" సినిమా చూసాను....
దాని ప్రభావం లేండి....... అంటే అదేదో నన్ను మార్చేసిందని కాదు....
అందులో మాష్టారి పాత్ర వేసిన యం.ఎస్.నారాయణ గారి "తెలుగు చచ్చిపొతే ....." డైలాగు నా మనసులో గింగిరాలు గింగిరాలు తిరిగేసి.... ఇలా నా చేత వ్రాయిస్తుంది...
అలోచిస్తే.... మెల్లమెల్లగా తెలుగు తన అస్థిత్వాన్ని కోల్పోతుందేమో అని భయం వేస్తుంది....
ఇది వరకటి రోజుల్లో ఎంత స్వచ్చమైన తెలుగు మాట్లాడుకునేవారం.....
చక్కగా "అమ్మా..! అన్నం పెట్టు.... ఆకలేస్తుంది" అని అడిగే రోజులు పోయాయి...
(నేను ఇంకా అలాగే అడుగుతాను/అంటాను అని పోట్లాటకి దిగకండి... ఇక్కడ మీ ప్రసక్తి ఎత్తలేదు... ఈసారికి ఇలా వదిలెయ్యండి)
ఇదివరకటి రోజుల్లో వార్తలు ప్రారంభించే ముందు "నమస్కారం... వార్తలు చదువుతున్నది XXX (శాంతి స్వరూప్) ముందుగా ముఖ్యాంశాలు" అని మొదలు పెట్టే వారు
(ఆ ముఖ్యాంశాలు అనేది కూడా తర్వాత్తర్వాత వచ్చిందే అంటారా...... సరే అలాక్కానీయండి...)
మరి ఇప్పుడో "Welcome to Morning News/Mid-Night News This is so and so.... ముందుగా Headlines"
ఏ తెలుగులోనే కదా చెప్పాలి వార్తలన్నీ ..... మరి ఆ నాలుగు ముక్కలు కూడా తెలుగులోనే ఏడవచ్చు కదా....
అయిపోగానే "This is XXX signing-off"
ఇప్పటి దాకా ఏ భూ-అంతరిక్ష గ్రహాల ఒప్పందాన్ని Sign చేసావు నాయనా...
చక్కగా "ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం....!" ఎటు పోయింది నీ సంస్కారం...
అలా అని నేను ఇంగ్లీషు భాషను ద్వేషించట్లేదు/దుమ్మెత్తిపోయట్లేదు.......
అమ్మలాంటి తెలుగు భాష అవహేళనకు గురి అవుతుంటే నిరసన తెలియజేస్తున్నాను....
ఆ సినిమాలో మాష్టారుగారు చెప్పినట్టు దెబ్బతగిలితే shit అని అశుద్ధం నొట్లో వేసుకునే వారికి అమ్మ లాంటి తెలుగు విలువ ఎలా తెలుస్తుంది చెప్పండి...
ఏవీ ఆ వీరి వీరి గుమ్మడిపండ్లు..... ఎక్కడా వినిపించవే ఆ యుగళ గీతాలు....
ఇదివరకు ఎవరైనా కనిపిస్తే పెద్దవారైతే నమస్కారం పెట్టి..... ఆ తరువాత బాగున్నారా ....? భోజనం చేసారా... ? అని అడిగేవారం....
అదే ఈ రోజు ఎదురయ్యారనుకోండి ఎంత పెద్దవారైనా.... "హల్లో అండీ హౌ ఆర్ యూ లంచ్ అయ్యిందా....?" అని మొదలు......
అలా అని లేచిందే మొదలు శుభోదయం....అంటూ ప్రతాపము చూపించేసి గ్రాంధీకం వాడనక్కరలేదు...
కనీసం కొన్ని విషయాలలో అయినా నియమంగా పాటిస్తే బాగుంటుందేమో.....
మా పిల్లలు పీజ్జాలు, బర్గర్లే తింటారమ్మా అని సాగదీసే తల్లిదండ్రులు ఉన్నంత కాలం ఈ మమ్మీ డాడీల పీడింపు తప్పదేమో....
అలా అని మరీ విపరీత ఆలోచనలతో గోడ కాగితాలు (Wallpapers)...... కిటికీలు(Windows).... అంటూ రాసినా కాసేపు నవ్వొస్తుందేమో కానీ... మాట్లాడుకోవడానికి బాగోదు.....
టీ, కాఫీలను ఎలాగో తేనీయము,పానీయము అంటూ పిలవలేము కదా..... మరి అనగలిగిన , మాట్లాడగలిగిన వాటిని ఖూనీ ఎందుకు చేయడం అనేదే నా ప్రశ్న...........
ఇలా చెప్పుకుంటూ పొతే చాంతాడంత అయ్యేట్టు ఉంది...... కుదిరితే ఇంకో టపాలో
నా గోడు వెళ్ళబోసుకుంటాను.....
ఇప్పటికి ఉంటాను ................
ఏమిటీ చూస్తున్నారు టాటాలు బై బై లూ గట్రా అంటాననా.....
ఇంతా రాసి ఆఖరున నన్ను నేనే గొయ్యి తీసి పాతేసుకుంటానా చెప్పండి......
హహహ బాగుందండీ మీ గోడు! సందర్భమో కాదో నాకు తెలియదు కాని నాకెప్పుడూ అనిపించే బాధ! బయట హోటళ్ళకి వెళ్ళి తినేటప్పుడు ఏమో కాని చక్కగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా చేతిని వాడరు కొంతమంది తినడానికి!
ReplyDeleteబాగా చెప్పారండీ.....
ReplyDeleteఅదేంటో మరీ అంత వెస్ట్రెనైజ్ అయిపోతున్నారు....
ఏమైనా అంటే అదేదో డైనింగు ఎటికేటంటారు.....
అందరూ పడే బాధే అనుకుంటా..... పొనిలే నాకు తోడు దొరికారు......
అబ్బ చా మీరేదో పెద్ద ఇదైనట్టు అని తిట్టిపోస్తారేమో అనుకున్నా....
Good post....(ఇదేం మాయరోగం "బాగుంది టపా" అని వ్రాయ వచ్చుగా అంటారా!:):)
ReplyDeleteబాగుంది అని కూడా రాసేసారు కదా పద్మర్పిత గారు...
ReplyDeleteఇంక నేనెందుకంటాను ....
అయినా అలా అననులెండి....
Hey, I am with you madam.
ReplyDeleteఏమిటి ఒళ్ళు మండిందా? నన్ను ఉప్పు పాతరెయ్యాలని అనిపించిందా? అనిపిస్తుంది. మూడు తరగతులు, వారానికి ఏడు మేళ్ళు, కథలు, కబుర్ల లింకులు, పిల్లలకు తెలుగు నేర్పడం మీద ఉపన్యాసాలు, నాటికలు, తతయ్యలకు ఉత్తరాలు ఇన్ని బాధలు పడుతుంటే నా ఎదుటే, ఏమిటీ నా ఎదుటే నన్ను భోజనానికి పిలిచి మరీ Kamni, shut the door. Please go upstairs and play అని పిల్లలతో అంటుంటే మండదట౦డీ మరీ..ఏదో ఈ రోజు మీరు కదిలించగానే ఇలా బయట పడిపోయాను గానీ..సంస్కారం ముసుగేసుకుని ఇహీ అని వచ్చేస్తుంటా...అయితే నాలాంటి వారున్నారన్నమాట. ధన్యవాదములు
"ఏమిటి ఒళ్ళు మండిందా? నన్ను ఉప్పు పాతరెయ్యాలని అనిపించిందా?"
ReplyDeleteఅలా అనిపించలేదండీ.....
అంతా చదివాక నాలాంటి వారున్నందుకు చాలా ఆనందంగా ఉంది....
నేను మీ బాధను అర్ధం చేసుకోగలను...
"అలా అనిపించలేదండీ.....అంతా చదివాక"
ReplyDeleteఅమ్మయ్యో అంతా చదవకపోతే నన్ను ఉప్పు పాతర వేసేవాళ్ళన్నమాటే.ఏదో లేచిన వేళ మంచిది కాబట్టి మీరు అంతా చదివారు కాని, చదవక పోతే ఏమయ్యుండేది.
హ హ హ .... అలా అంటే ఇంకేమంటాను చెప్పండి....
ReplyDeleteమీ ఉగాది నాటిక చూసానండీ..... చాలా బాగుంది.....
కామెంటు కూడా ఇచ్చాను...
నిజంగా మీ ప్రయత్నానికి అభినందనలు తెలియజేయకుండా ఉండలేకపోతున్నాను....
ఈ పరిస్థితి ఎవరో కల్పించలేదు. మనమే మన నోళ్ళకి సంకెళ్ళు వేసుకుంటున్నాము.
ReplyDeleteఅవును శర్మగారు..... మీరు చెప్పింది అక్షర సత్యం....
ReplyDeleteఅందుకే ఈ బాధంతా...
Chaala chaala baagundi Madhavi. Ilanti blogs inka enno rayalani ni aasisthunnanu. Ivalti rojuna entha mandiki sarigga "ala", "ana" (Kallu, pallu lo ala and Banam, Ranam lo ana) palakadam vachu. Cinema heros lo chaala mandiki raadu. Inka tv ads and achors gurinchi cheppanavasaram leedu. Ila cheppu kuntu pothe neenu kooda oka blog rayalsi vasthundi. Rasthanemo mundu mundu.
ReplyDeleteచాలా బాగా చెప్పారండీ..........
ReplyDeleteకానీ అటువంటివారినే ప్రోత్సహిస్తున్నారు మన తెలుగువారు....
Madhavi
ReplyDeleteChaala bagundi. ma ammai ni matram nenu ma vaaru daniki telugu meede ekkuva dhyasa vellela choostham kani enthakalam vintarau mana mata...
manam andaram chethulara chesukuntunna thappu..,thappani thelisina chesthunnam ade inka ekkuva ....
edemina nuvvu raasaindi chaala bagundi..
చాలా ఆలస్యంగా చూసానండీ మీ తెలుగు బాధని.. ఈ సారికి మన్నించేయండి. మమ్మీ డాడీల పీడింపు తప్పదేమో.... ఈ మాట చదవగానే నాకు ఒకటి గుర్తొచ్చింది..అజ్ఞానమో, ఏమో నాకు తెలియదు.. కాని పంచుకోవాలనిపించింది. ఎక్కడ చదివానో నాకు గుర్తు లేదండీ కానీ మమ్మీ అంటే ఈజిప్షియన్ శవం అనీ, డాడీ అంటే గాడిద (ఈ మాట నిజమని తెలుసుకోవడానికి నేనెప్పుడూ ప్రయత్నించలేదు ) అని చదివినట్టు గుర్తు.. అదే నా బుర్రలో అలా అతుక్కుపోయి ఉండిపోయింది. ఇప్పటికీ మా అమ్మని ఎవరన్నా మమ్మీ అంటే పిచ్చ కోపం వచ్చేసి వాళ్ళతో గొడవ పడ్డానికి కూడా వెనుకాడను. అలా ఫిక్స్ ఐపోయానండీ. ఇదీ నా బాధ. అసలే మీరు బోలెడు బాధలో ఉంటే నేను మళ్ళీ మీకు కొత్త బాధలు చెప్పడం ఒకటి. మొత్తానికి మీ వ్యాసం చాలా బాగుందండీ..ధన్యవాదాలు.
ReplyDeleteఅదేంటో మరీ అంత "వెస్ట్రెనైజ్" అయిపోతున్నారు..
ReplyDeleteమరిదేంటో!?
చాలా బాగా అన్నారండీ....
ReplyDeleteకాకపొతే వాళ్ళను ఎత్తిచూపడానికి ఉపయొగించిన పదాలలో ఇదొకటి....
డైనింగు ఎటికేటు ఒకటి
ఈ విషయం మీద అప్పుడెప్పుడో ఒక టపా వ్రాశాను.....http://harephala.wordpress.com/2009/10/29/baataakhaani-60/
ReplyDeletechala chal ghagundi
ReplyDeleteమాధవి గారు నేను కూడా దీని గురించి రాయాలని అనుకున్నాను. ఈ మధ్య అందరితో చెప్పను లంచ్ అయ్యిందా అని అడిగారు అంటే చంపేస్తాను అని..పెద్దవాళ్ళు కనబడినప్పుడు మా చిన్నప్పుడు కాళ్ళకి దణ్ణం పెట్టేవాళ్ళం.భోజనం చేసారా అని అడిగేవాళ్ళం ...అసలు ఆంటీ అని అంటే అమ్మ కోప్పడేవారు.పిన్ని, పెద్దమ్మ, అమ్మమ్మ ఇలా పిలిచేవాళ్ళం..మనం ఇప్పుడయిన కళ్ళు తెరిచి అవకాసం ఉన్నంతవరకు తెలుగు లో మాట్లాడటానికి ప్రయత్నం చేద్దాం.
ReplyDelete@గీత గారు : కొన్ని విషయాలైనా మనం నేర్పిస్తే బాగుంటుందేమో....
ReplyDelete@subha గారు : మమ్మీ అంటే ఈజిప్షియన్ శవం అనే మాట వాస్తవమే...... ఏమిటో ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయని ఇప్పుడే తెలుస్తుంది.....
@harephala : ఫణిబాబు గారు మీ పోస్టు చదివానండీ.... బాగుంది.... కామెంటు కూడా ఇచ్చాను...
@Anonymous : మీకు నచ్చినందుకు ఆనందంగా ఉందండీ..
@kallurisailabala గారు : చాలా బాగా చెప్పారు శైలూ....ఇక నుంచైనా వీలున్నంతవరకు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం........ తప్పకుండా అండీ.... మన రేపటి తరాల వారికి మనం ఇవ్వగలిగిన వాటిల్లో అమూల్యమైనది ఇది ఒకటి...
ఫణి బాబు గారి టపాలో మీ కామెంటు ఇప్పుడే చూశాను.క్షమించాలి, అలవాటు అయిన పొరపాటు లో మాష్టారు అనేశాను. మీ బ్లాగు పరిచయం అవడం సంతోషం గా ఉంది.
ReplyDeleteమీరు వెంటనే పేరు మార్చేయ్యండి అని సలహా ఇవ్వను కానీ ....
తెలుగు వాడకం పట్నవాసాలలోనే తగ్గింది అనుకుంటాను.మమ్మీ, డాడీలు వచ్చేసినా, పల్లెలలో ,ఓ మాదిరి చిన్న పట్టణాలలో ఇంకా బాగానే ఉంది. మనం మారితే చాలు తెలుగు బాగానే ఉంటుంది.
@బులుసు గారు : మీరు మా బ్లాగుకు విచ్చేయడం మా అదృష్టం.......
ReplyDeleteచెప్పకనే చెప్పారు కదా పేరు మార్చమని......
తెలుగు వాడకం ఇంకా బాగానే ఉందంటే అది మంచి విషయమే ......
బాగా చెప్పారు మనం మారితే చాలు....
ఇంతమంది పెద్దలూ పిన్నలూ వ్యాఖ్యలు వ్రాశాక, నేను వ్రాయకుండా వుండగలనా!
ReplyDeleteచాలా బాగుంది మీ టపా. వెంటనే అనుసరించడం మొదలెట్టాను.
నా "తెలుగు రాడికల్", ఇతర బ్లాగుల్లోనూ తరచూ వ్రాస్తూనే వుంటాను ఇలాంటి విషయాలు.
వీలైతే చదవండి.
నేను మీ బ్లాగ్ లో నా పేరుతో కామెంటాలంటే ఏంచెయ్యలండీ??? అజ్ఞాత గా కామెంటడం ఇష్టం లేక అడుగుతున్నా..
ReplyDeleteఎన్నెల
నా బ్లాగు పోస్ట్ ఒపెన్ చేసినప్పుడు పైన మూలన సైన్-ఇన్ అని కనిపిస్తుంది....... అక్కడ మీ బ్లగ్గెర్ ఐడి , పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయ్యి కామెంటితే సరిపోతుంది....
ReplyDeleteమీరు ముందుగానే లాగిన్ అయ్యి ఉంటే అదే పేరు (మీ బ్లాగు కి ఉన్న పేరు తొనే కామెంట్ కనబడుతుంది)