Monday, August 19, 2013

అమ్మ మహాకుంభమేళా యాత్ర - 1

అమ్మ మహాకుంభమేళా యాత్ర - 1

కుంభ మేళా అనేది 12 ఏళ్ళకు ఒకసారి జరిగే ఉత్సవం. దీన్ని వీక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ప్రజలు హాజరవుతుంటారు. 

కుంభమేళా ఈ 4 ప్రదేశాలలో ఏదో ఒక నగరంలో జరుగుతుంది... అల్లహాబాద్, హరిద్వార్, ఉజ్జయని మరియు నాసిక్

అర్థ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ మరియు ప్రయాగలో జరుగుతుంది...

పూర్ణ కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగలో మాత్రమే జరుగుతుంది...

మహా కుంభమేళా ప్రతి 144 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగలో మాత్రమే జరుగుతుంది...


2013లో జరిగిన మహాకుంభమేళాలో ఒక్క మౌనీ అమావాస్యనాడే 30 మిలియన్ల భక్తులు ప్రయాగలో స్నానం చేసి ఉంటారని అంచనా...


ఈ సంవత్సరం జరిగిన మహాకుంభమేళకు అమ్మ, సరస్వతి అత్తయ్య, మా అమ్మ స్నేహితురాలు సుజాత ఆంటీ కలిసి వెళ్ళారు.

అలా వెళ్ళిన వారి ప్రయాణంలో జరిగిన ఘటనలు, ఎదుర్కున్న పరిస్థితులు అమ్మ నాకు చెప్పారు ...

అవి విన్న తరువాత దేవుడు నిజంగా మనకు అడుగడుగునా తోడుంటాడు అనేది అక్షర సత్యం అనిపించింది..
ఆ అనుభవాలే ఇప్పుడు నేను మీ అందరితో బ్లాగ్ముఖంగా పంచుకోదలిచాను....


అమ్మ కుంభమేళా జరుగుతున్న కాశీ పట్టణానికి వెళ్ళదలిచి సాయి మావయ్య చేత తత్కాల్ లో టికెట్లు బుక్ చేయించారు. రెండు సార్లు బుక్ చేసినా టికెట్లు కన్ఫర్మ్ కాలేదు.
ఇక ఆఖరున ఏదైతే అది అవుతుందని జనరల్ టికెట్లు బుక్ చేసుకుని అమ్మ, ఆంటీ కొత్తగూడెం నుంచి ఖమ్మం వెళ్ళారు. ఖమ్మంలో సరస్వతి అత్తయ్య ఇళ్ళు చేరుకుని అత్తయ్యకు టికెట్ల విషయం చెప్పారు. ఎలాగైనా నేనూ వస్తానని అత్తయ్య కూడా భద్రాచల రామయ్యకు దండం పెట్టుకుని వారితో కలిసి ఖమ్మం రైల్వే స్టేషన్ చేరుకున్నారు. అక్కడ రైలు పదిహేను నిమిషాలకు మించి ఆగదు అని తెలుసుకున్నారు.

రైలు వచ్చాక చూస్తే జనరల్ బోగీలో విపరీతమైన జనం.... ఇసుక వేస్తే రాలదంటారే అలాగ....

అసలు ఏ బోగీ చూసినా కాలు పెట్టే సందు లేదు... ఏ బోగీలో అయినా ఇంత చోటు దొరకపోదా అని సామాన్లు పట్టుకుని ప్రతి బోగీ వెతుక్కుంటూ వెళ్తున్నారు....

అలా వెతుకుతూ వెతుకుతూ రైలు ఆఖరు బోగీ దగ్గరకు వచ్చారు... చూస్తే బోగీ అంతా ఖాళీ...అది వికలాంగుల బోగీ.. ఎక్కొచ్చా లేదా అని అలోచిస్తుంటే అక్కడే ఉన్న టీ.సి. చూసి పర్లేదు ఎక్కేయమని చెప్పారు...వీరు ఎక్కడం చూసి ఇంకొకరు కూడా ఎక్కారు.....అతనికి సుమారు 50ఏళ్ళు ఉంటాయేమో....

రైలు కదిలాక చూస్తే ఆ బోగీలో వీరు 4 తప్ప ఇంకెవరూ లేరు, ఇక వెంటనే అత్తయ్యకి సంకోచం కలిగి అతని వివరాలు కనుక్కోమని చెప్పారు (అతను తెలుగువాడు కాడు).

అమ్మ అతని పేరు, వివరాలు కనుక్కున్నారు... అతను అన్నీ చెప్పారు కానీ తాను ఎక్కడ ఉంటారో చెప్పలేదు... 

అతనితో కబుర్లు చెప్తూ ప్రయాణం కొనసాగించారు...అలా కొన్ని గంటలు గడిచాక ఆ బోగీ కూడా జనంతో కిక్కిరిసిపోయింది....కానీ వారి ప్రయాణం మటుకు సజావుగానే సాగింది...

వారందరూ కలిసి ఎట్టకేలకు ప్రయాగ చేరుకున్నారు....

వారితో పాటు ప్రయాణం చేసిన వ్యక్తే వీరి సామాన్లు కొన్ని మోసి త్రివేణీ సంగమం దాకా చేర్చారు...

స్నానాలు ముగించుకుని, దీపాలు వెలిగించుకొని దగ్గర్లోని టిఫిన్ సెంటరుకు వచ్చారు....

అతను వీరు టిఫిన్ చేసేవరకు ఉండి సెలవు తీసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయారు....

అయ్యో అతను టిఫిన్ కూడా చేయలేదు తిని వెళ్ళమని చెప్దామని వెనక్కి తిరిగి చూస్తే అతడెక్కడా కనిపించలేదు...

ఇంతకీ అతని పేరేంటో మీకు చెప్పలేదు కదూ.... 

                                      దశరథ్


శ్రీరాముని అభీష్టం మేరకు నీ భక్తులను నేను క్షేమంగా చేరుస్తానని దశరధులవారే స్వయంగా వచ్చారేమో....! అనుకుని మనసులోనే నమస్కరించుకున్నారు ముగ్గురు....



4 comments:

  1. నిజంగా ఇటువంటివి నమ్మవలసిందే మా అమ్మగారికి కుడా ఇలాగే జరిగిందోసారి

    ReplyDelete
  2. బాబా బుక్ లో చదివిన సంఘటన గుర్తుకు వస్తుంది.

    దేవుడు ఎక్కడో లేడు మనతోనే ఉన్నాడు అన్న మాట నిజం. మిగతా భాగాల కోసం Waiting....

    ReplyDelete
  3. శ్రీరాముని అభీష్టం మేరకు నీ భక్తులను నేను క్షేమంగా చేరుస్తానని దశరధులవారే స్వయంగా వచ్చారేమో....! అనుకుని మనసులోనే నమస్కరించుకున్నారు ముగ్గురు....

    బావుంది మాధవి

    ReplyDelete