Tuesday, June 17, 2014

శివకుమార్ ఆదెళ్ళ గారి నవల - నికృష్టుడి ఆత్మకథ పై నా అభిప్రాయము


నికృష్టుడి ఆత్మకథ  -- నికృష్టుడి ఆత్మకథ...కినిగె లంకె

నికృష్టుడి ఆత్మకథ -- ఈ టైటిల్ చదవగానే ఇదేంటబ్బా  ఇలా ఉంది  అనిపించింది 

ప్రివ్యూ చదివాక ఆసక్తికరంగా తోచింది .... వెంటనే పుస్తకం చదివేయ్యాలి అనిపించింది

నేను కినిగేకి కొత్త .... స్నేహితురాలి సహాయంతో ఎట్టకేలకు పుస్తకం డౌన్లోడ్ చేసుకోగలిగాను .... అందుకు స్నేహితురాలికి ధన్యవాదములు 

ఈ ఆత్మకథ లోకి వస్తే .... చదవటం పూర్తి అయ్యాక కూడా ఆలోచనల పరంపర ఆగలేదు .... 

నిజం చెప్పాలి అంటే ఈ మనిషి నికృష్టుడు కాక ముందు చాలా మంచివాడు ....

కుక్కని ఎవరో కొట్టుకుంటూ తీసుకువెళుతున్నారని బాధపడిన మనస్తత్వం అతనిది

అలాంటి వాడు గోవులను అమ్మేస్తూ "కోసుకుంటారో ... కూరోన్డుకుంటారో నాకెందుకు?" అని తను చేసే తప్పుని కూడా అంతలా సమర్ధించుకునే స్థితికి దిగాజారాల్సిన అవసరం ఏంటి ...??

డబ్బంటే ఎవరికీ చేదు చెప్పండి ..... ఏ ఉద్యోగం లేని వాడు అనుకోకుండా గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం మొదలుపెడితే మన ఆఫీసర్లు అతనికి నేర్పిన/చూపిన దారులేంటి ....?? 

ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి ...?? అందరూ అలాగే ఉన్నారు ... ప్రతి ఒక్కరికీ డబ్బే ముఖ్యం .... ఈజీ మనీ కోసం పాకులాట .....

కాకపోతే ఈ మనిషి డబ్బు ఎంతవరకు ఉంటే మేలు అనేది మర్చిపోయి... విచక్షణ కోల్పోయి ధన దాహం తో అవినీతి సముద్రం లో ఈదుకుంటూ వెళ్ళిపోయాడు 

అందుకే పరమ నీచుడు , నికృష్టుడు అయ్యాడు ..... 

అయితే మంచివాడు అని ఎందుకు అన్నాను అంటే "భార్యను హింసించలేదు" పైగా భార్య అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేనేమో అని భయపడ్డాడు అంటే ఏ మూలనో  అపరాధభావం అనేది ఉంది కదా ...

తను చేసేది తప్పు అని తెలిసిన ఒక లెవెల్ కి చేరుకున్నాక తప్పులు వద్దన్నా చేయకుండా ఉండలేము ... ఉంటాము అంటే సమాజం ఊరుకోదు (అయితే ఇతడు ఎప్పుడు తప్పు చేయడం మానెయ్యాలి అనుకోలేదు కాబట్టే నికృష్టుడు అయ్యాడు )

దేవుని వద్దకు వెళ్ళి కూడా అహంకారంతో మాట్లాడటంలో అతడెంత మూర్ఖుడో తెలుస్తుంది 

కుక్క లాగా తిరిగోచ్చినప్పుడు మటుకు నాకైతే అతనిలో కొంత మార్పు వచ్చేసినట్టే అనిపించింది 

ఎందుకంటే కుక్కకు కరిచే శక్తి ఉంది ... తను ఎలా చనిపోయాడో తెలిసినప్పుడు , తన వాళ్ళే తనను తిట్టుకునే సందర్భంలో ఎప్పుడూ ఇతను ఆ శక్తిని ఉపయోగించలేదు 

ఆఖరున సత్యం తెలుసుకోగాలిగాడు.... ముక్తి పొందాడు ....

ఇక్కడ రచయిత గారికి కృతజ్ఞతలు తెలపాలి 

మాకు తెలియని కొన్ని విషయాలు తెలియజెప్పారు 

గోవుల చట్టం ... గోవుల పై కాశీలో జరిగే అమానుషం ....

గవర్నమెంటు ఆఫీసుల్లో , పోలిస్ స్టేషన్లలో , రాజకీయాలలో (ఒక ఫ్లై ఓవర్ కట్టడం లో మరియు బినామీ ఆస్థుల విషయంలో) జరిగే వివిధ రకాల అవినీతి కార్యకలాపాలను బయటపెట్టే ప్రయత్నం చేసారు ....

కొన్ని చదివి బాధేసింది ..... కొన్ని చదివి అవునా ... ఇలా కూడా జరుగుతాయ అనిపించింది ....

ఏది ఏమయినా ఇది అందరూ తప్పక చదవవలిసిన ఆత్మకథ.....

ఒక పుస్తకం నుంచి మనం ఒక్క విషయం తెలుసుకోగాలిగినా,నేర్చుకోగాలిగినా.... ఆ పుస్తకం చదివినందుకు సార్ధకత ఏర్పడుతుంది, సంతృప్తి కలుగుతుంది  అని అనుకుంటే 

ఈ ఆత్మకథ చదివినందుకు మీకు ఆ సంతృప్తి తప్పక కలుగుతుంది అని నేను నమ్మకంగా చెప్పగలను 

మాధవి

No comments:

Post a Comment