Wednesday, May 19, 2010

త్పృవ్వట బాబా ..... లేఖినే సబబా..?


తెనాలి రామకృష్ణుడి "
త్పృవ్వట బాబా "  సమస్యను నేను కొంత వరకైనా పూరించాను అని చెప్పుకునే అర్హత కలిగించిన లేఖినికి నా హృదయపూర్వక నమస్కారములు.....

ఇక అసలు విషయానికి వస్తే ....  ఈ సమస్య తెనాలి రామన్న ఎందుకు , ఎవరిని అడిగాడు....?  వివరాల్లోకి వెళ్తే...

ఒక రోజు శ్రీకృష్ణదేవరాయలి కొలువుకి "సహస్ర ఘంట కవి నరసరాజు" వస్తాడు. ఇతనికి పట్టిన ఘంటం ఆపకుండా రాస్తాడని బాగా పేరు గలదు.
పరుల కవితలలో తప్పులు  పడతాడని పేరు కూడా ఉంది.
తన విద్యను పరీక్షించి విజయ పత్రిక కటాక్షించమని  శ్రీకృష్ణదేవరాయని అర్థిస్తాడు.

సరే అలాగే చూద్దాము, విద్యను ప్రదర్శించమంటాడు  రాయలు.
ఇంతలో పెద్దన ఒక క్లిష్టమైన పద్యము వినిపిస్తాడు. నరస కవి పెద్దన చెప్పిన పద్యము రాస్తాడు

ఎవరికీ ఏమి అర్ధం కాలేదు....
ఇంత కష్టమైన పద్యాన్ని చాలా సునాయాసంగా రాసేసాడని అలోచిస్తుంటారు...

ఇంతలో మన తెనలి రామన్న లేచి ...  ఏది ఈ పద్యం రాయండి చుద్దాం అంటూ ఇలా చెప్తాడు........
త్పృవ్వట బాబా .....
తల పై పువ్వట జాబిల్లి
వల్వ బూదెట ........... చేదే బువ్వట
చూడగ నుళుళుక్కవ్వట  అరయంగనట్టి హరునకు జేజే...


నరస కవి ఘంటం ఒక్కసారిగా ఆగి పోయింది...

తెనాలి రాముడు ఆగ్రహం పట్టలేక  "చెప్పిన పద్యమే రాయలేని వాడవు......  పెద్దన కవిత్వం లో తప్పులు పడతావా అంటూ..."  ఇలా పద్య రూపం లో చివాట్లు పెడతాడు.

తెలియనివన్ని తప్పులని
దిట్ట తనాన సభాంతరమ్మునన్
పలుకగ రాదురోరి పలుమారు పిశాచపు పాడె గట్ట
నీ పలికిన నోట దుమ్ముబడ
భవ్యమెరుంగవు పెద్దలైన వార నిరసింతువా..
ప్రగడరాణ్ణరసా 
విరసా... తుసా..... భుసా...

దానితో నరస కవి తల వంచుకొని వెనుదిరుగుతాడు.
కాని మన రాయల వారు చేతికి ఎముక లేని దాత కదా ఆ కవి కి తగిన బహుమానం ఇచ్చి పంపిస్తాడు...

మరి నా బహుమతి ఎప్పుడు వస్తుందో...?



17 comments:

  1. త్ప్రవ్వట బాబా అని చదివిన జ్ఞాపకం.
    నులులుక్కవ్వట --అనుకుంటా
    ప్రగడగాణ్ణరసా - అనుకుంటా
    తప్పులు పడతామనే ఉద్దేశంతో కాదు, గాని నన్ను నేను కరక్టో కాదో తెలుసుకుందామని.

    ReplyDelete
  2. బాగుందండి...

    ReplyDelete
  3. నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) గారు చాలా థాంక్స్ అండీ...
    సవరించాను...
    నేను విన్నది మాత్రమే రాసానండీ ...
    నేను విన్నప్పుడు త్పృఅటబాబా అనే వినిపించిందండీ..

    ReplyDelete
  4. చాలా బాగుందండి..."దీని భావమేమి "Maddy"శా "

    ReplyDelete
  5. అందరికీ థాంక్స్ అండీ..
    నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) గారు సవరించాను....

    కాని త్పృవ్వట బాబా అలాగే ఉంటుందని నెట్ లో కూడా చూసాను
    ధన్యవాథములు...

    ReplyDelete
  6. హ్మ్.. మీకు దీనితో కలిపి నాలుగు బహుమతులు వచ్చాయి. అందుకోండీ!! :)

    ReplyDelete
  7. తప్పు రాశాను, ప్రగడరాణ్ణరసా అని ఉండాలి.

    ReplyDelete
  8. నేను చూసిన "తెనాలి రామకృష్న" సినెమా ప్రకారం మాత్రం అది 'త్పృవ్వట' కాదండి - చిన్న పిల్లలు 'బస్సాట' ఆడుకున్నపుడు పెదాలు కలిపి ఒక విధంగా శబ్దం చేస్తారు చూడండి - అది -అందుకే అవతల కవి రాయలేకపోతాడు.

    ReplyDelete
  9. ok...but whats the meaning of that padyam?

    ReplyDelete
  10. Yes, the first letter is a non-letter; a kind of fluttering sound made by blowing air through pursed lips.
    The poem is in praise of Lord Siva
    It basically means - Oh my gosh, he has moon on his head, he wears snakes, he drank poison, he is just amazing to look at - Glory to such Lord Siva

    ReplyDelete
  11. అలాగే "ళుళుళుక్కవ్వట" అనేటప్పుడు, చిన్నపిల్లలకి జోల పాడేటప్పుడు నాలిక పైకి, కిందకి కదలిస్తు "ళుళుళు హాయి" అని పాడతారు కదా, ఆ శబ్దం అన్నమాట.

    ReplyDelete
  12. అందరికీ ధన్యవాథములు....

    ఆ శబ్దము ఎవరూ పూర్తిగా రాయలేరండీ...
    అదొక వింత శబ్దము... ఏదొ ఒక విధంగా రాయకొపొతే .... ముందుకు తేవడం కష్టమని అలా రాసాను...

    ReplyDelete
  13. Wit Real గారు చాలా థాంక్స్ అండీ...

    ReplyDelete
  14. bagundandi.....

    ReplyDelete
  15. It reminds me another story but it is about Kalidasu. Kalidasu and Bhavabhuti were among the Navaratna's of Raja Vikramarka's court.

    once they had quarrel with each other on who's great pundit among them. Then they prayed Maa Kali to resolve their quarrel and decide who is superior over the other. Maa kali appears and says Bhavabutisthay Panditha ( Bhavabuti is a pandit ), Kalidas gets angry and says Koha Randey ? ( Nenu evariney Lanja ?)
    Maa Kali says Tvamevahama Tvamevaham Na samsayah (You are none other than me and I am none other than you,No doubt about it)and disappears.

    ReplyDelete