Sunday, January 22, 2012

ఇది కూడా బాధేనండీ....మరి మీరేమంటారు....?

ఇది కూడా బాధేనండీ....మరి మీరేమంటారు....?

ఏది బాధా........? ఎందుకా బాధా.....? అంటారా..? అదే చెబుతాను చదవండి....

మొన్న నేను వంట చేసాక అమ్మతో మాట్లాడుతున్నానా.......నాకు అనుకోకుండా ఒక ఆలోచన వచ్చింది......
అమ్మతో అనలేదు లెండి కానీ మీతో పంచుకుంటున్నాను....

ఆలోచన అంటావు..... బాధ అంటావు ... ఏంటో చెప్పొచ్చు కదా అంటారా ....... అలాగే ఐతే మీరే చదవండి......

తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి చేసి పంపుతారు కదా........ అదే ఆడపిల్లలకే లెండి ........
అలా పంపాక ఆడపిల్లలు ముందు నేర్చుకున్నా నేర్చుకోపోయినా............
ఎంతో కష్టపడి వంట చేస్తూ కొద్దిరోజుల్లోనే అందులో ప్రావీణ్యత సంపాదించుకుంటారు...

అది కొత్తగా చెప్పాలా... మాకు తెలియదా అనకండి.... విషయములోకి వస్తున్నా....

ఒకవేళ ఆ తల్లిదండ్రులకి ఆడపిల్లలు మాత్రమే ఉన్నారనుకోండి......... పిల్లల పెళ్ళిళ్ళు చేసి పంపేసాక వారికి పెద్దతనం వల్ల ఏ జ్వరమో , వంట్లో బాగోలేకపోవడమో వచ్చిందనుకోండి .... (రావాలని నా ఉద్దేశ్యం కాదు...) నాన్నకా... పొయ్యి వెలిగించి టీ పెట్టడం కూడా రాదు......... ఎంత ఓపిక లేకపోయినా అమ్మకు లేచి వంట చేయడం తప్పదు........

ఎంతో బాగా వంట చేయడం వచ్చి పాట్లక్కులకి (PotLucks/Get-togethers ki) వాటికి వంట బ్రహ్మాండంగా చేసి అందరి మన్ననలు అందుకొని అమ్మకి ఫోను చేసి మరీ "అమ్మా....! ఇవాళ నేను చేసిన గుత్తొంకాయ ఎంత బాగా కుదిరిందో ...... అందరూ చాలా మెచ్చుకున్నారు" అని చెప్పే కూతురికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధగా ఉంటుందో కదండీ....

"నువ్వు నేర్పిన వంటనే నేను రకరకాలుగా చేయగలిగినా ఒక్క రకం కూడా నీకు చేసి పెట్టలేని నా ఈ స్థితిని ఎలా వివరించాలో తెలియడంలేదని " ఆ అమ్మడి గుండె ఎంత విలవిలలాడుతుందో కదా....

అంటే ఆడవారికేనా బాధ మాకు ఉండదా అంటూ గొడవకి రాకండి...... మీ గురించి కూడా చెబుతున్నాను.....

కూతురిని అత్తారింటికి పంపాక, ఉన్న ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండీ...............??

కొడుకులకు కూడా ఆ బాధ ఉంటుందండి........ (ఏదీ ...? వంట చేసి పెట్టడమా అనకండి....!)


అమ్మ ఎప్పుడైనా "నాన్నకి బాగాలేదురా ....! ఆస్పత్రి కి ఒక్కరే వెళ్లి వచ్చారు" అన్నప్పుడో........!

"ఇవాళ కరెంటు బిల్లు వచ్చిందిరా నాన్నకి బాగోలేదని నేనే ఎలాగోలా కట్టేసి వచ్చాను " అన్నప్పుడో.......!!

లేక

"పండక్కి వంటలేమి చేసావు అమ్మా............?" అని కొడుకడిగితే

"ఉన్నది మేమిద్దరమే కదరా... ఏమి వండినా తినేది ఎవరు.... అందుకే కాస్త పులిహోర కలిపి నైవేద్యం పెట్టేసా" అని చెప్పే అమ్మ మాటలు విన్నప్పుడు.....

అబ్బాయిలకి కూడా బాధగా ఉంటుందండీ....

మరి ఇంత బాధ పడేవాళ్ళు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి .....? విదేశాలకెందుకు వెళ్ళాలి.........? అని అడుగుతారేమో........!!

ఆడపిల్లలకి పెళ్లి చేయకుండా ఏ తల్లిదండ్రులు ఉంటారు చెప్పండి ......?

ఏదో బలీయమైన కారణం లేనిదే ఏ కొడుకైనా తన తల్లిదండ్రులను వదిలి దేశాలు పట్టుకు వెళ్ళిపోతాడా చెప్పండి........??

అవి ఎటువంటి కారణాలైనా కావచ్చు......... కానీ ఇవి కూడా బాధలేనండీ........ మరి మీరేమంటారు........?

12 comments:

  1. బాధే సౌఖ్యమనే భావన రానీవోయ్........ఆ యెరుకే.....

    ReplyDelete
  2. chaalaa bagundi...... maa baadhalu kooda same ave....

    ReplyDelete
  3. పెళ్లి చేసి ఇంట్లోంచి పంపివేయ బడ్డ కొంత మంది ఆడపిల్లలు మొగుడిని వాడి పుట్టింటిలోంచి ఎందుకు లేపుకు పోతారూ అని కొంత మంది బాధ.

    (పారిపో పారిపో .... పోయాను)

    ReplyDelete
  4. nijame kadandi,okosar e pellilu evaru aknipettaru anipisthundi,antholene pelli valle ga manam,mana amma ,nanna ,chelli ee relations anni anipishtundi.emito life ee rojulo idi abbyilina,ammyilina okela vundi,parentsni,sibilings vadili durmaga vundali.

    ReplyDelete
  5. మాధవి గారూ మనసులో స్థిరంగా ఉండి ఎప్పుడూ తలెత్తే అంశం ఇది..

    ReplyDelete
  6. కలం కదిలినా బాధే
    కాలం నిలచినా బాధే
    రాదే మరి కలకాలం ఆవాలం
    అమ్మా నాన్నల కు ఆలంబనం

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  7. kastephaleగారు :- ప్రయత్నిస్తానండీ... ఈసారి ఇలాంటివి రాసినప్పుడు .... :-)

    Padma K గారు - ధన్యవాదములు... అది తెలిపే ప్రయత్నమే చేసాను... ఇది మాది కూడా...

    బులుసు సుబ్రహ్మణ్యంగారు -
    పారిపోయారు కాబట్టీ ఈసారికి వదిలేస్తున్నాను ...... :-) మీరు ఆ కోవకి చెందినవారైతే ఆ కష్టాలు మీరే రాయాలి మరి...

    ReplyDelete
  8. Anonymousగారు - avunandee..... adi nijam..... :-)

    జ్యోతిర్మయి గారూ - మనసులో ఉన్నదాన్నే బయట పెట్టే ప్రయత్నం చేసానండీ.....

    Zilebi గారూ - రాదెందుకో మరి....!!...........:-)

    ReplyDelete
  9. మాధవి నువ్వు చెప్పింది నిజమే.
    ఇలాంటి బాధలకి మందు ఎంతో ఉపశమనం ఎలాగో తెలీదు.

    ReplyDelete
  10. మాధవి నువ్వు చెప్పింది నిజమే.
    ఇలాంటి బాధలకి మందు ఏంటో ఉపశమనం ఎలాగో తెలీదు.

    ReplyDelete
  11. నిజమే శైలూ అసలు మందు లేదనే చెప్పాలి...

    ReplyDelete
  12. Sri Chaganti garu once told in one of the pravachanam that son and father should be under one roof and always see each other. It's good for both of them. It's obvious that daughter-in-law entering such a household will be looked after like a daughter. Although this looks like a rare and difficult situation, good things always come to those who take time to follow Dharma irrespective of the effort involved. Sorry for preaching !!!

    ReplyDelete