Tuesday, January 31, 2012

వీరికి మీ వంతు సహాయం చేయండీ ప్లీజ్......

మొన్న జనవరి 26వ తారిఖు,గణతంత్ర దినోత్సవాన అమ్మను ఒక స్కూలు వారు జెండా ఎగరవేయటానికి చీఫ్ గెస్టుగా పిలిచారు.అది అంగ వైకల్యములు గల పిల్లల స్కూలు.....
అక్కడ ఎంతోమంది చిన్న పిల్లలకు కళ్ళు కనబడవు , చెవులు వినబడవు , మాటలు రావు.
చూడటానికి 40 ఏళ్ళున్నా ఎదగని మెదడుతో ఉన్నారొకరు. మొత్తం వంద మంది దాకా ఉంటారు....

ఇక్కడ ఇచ్చిన పికాసా అల్బం లింకులో వారికి వచ్చిన విధంగా చేసిన ఆసనాలు, యోగా మొదలగునవి చూడొచ్చు..... కొంత మంది 'మౌనంగానే ఎదగమని..." లాంటి కొన్ని పాటలు కూడా పాడారంట......

Shanthi Welfare Association for Deaf, Blind and handicapped

ఇదంతా మీకెందుకు చెబుతున్నానంటే ఆ పిల్లలు ఎవరూ లేక , తల్లిదంద్రులు తమకు వద్దనుకున్న వారు. వీరందరినీ ఒక వృద్ధ దంపతులు చేరదీసి ఇన్నేళ్ళుగా వారి బాగోగులు చూసుకుంటున్నారు.

కానీ ఏ ఒక్కరు వీరికి సహాయం చేయడానికి ముందుకు రాక ఉన్న ఆస్థులు ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ నెట్టుకొస్తున్నారు.

ప్రస్తుతానికి పిల్లలకి తరగతి గదులు, హాస్టలు రూములు అవీ మటుకు ఉన్నాయి.... ఆ పక్కన ఉన్నవన్నీ అమ్మేసారు. ఇప్పుడు ఆ పెద్దాయనకి కూడా ఒంట్లో బాగోలేక పూర్తిగా మంచం మీదే అన్నీ అనే స్థితికి వచ్చారు.

ఆ దంపతుల కూతురు , అల్లుడు ఆ స్కూలుని నడుపుతున్నారు.....
కూతురే పిల్లలకి అన్నీ చేస్తున్నారు.... స్నానాలు పోయడం, భోజనం పెట్టడం మరియు మిగితా కార్యక్రమములు కూడా....

నేను ఇదంతా చెప్తున్నది ఎందుకంటే వీరికి తినడానికి కూడా సరి అయిన భోజనం లేక ఉన్న కొద్దిపాటి లోనే నెట్టుకొస్తున్నారు

మనం పుట్టినరోజులూ, పెళ్ళిరోజులూ , ప్రేమికుల రోజు అంటూ ఎన్నో జరుపుకుంటాము కదా...... ఆ ఏదో ఒక రోజుని ఎంచుకొని ఈ పిల్లల కోసం ఒక 100 రూపాయలో లేక మీరు నిజంగా అక్కడి దాకా వెళ్ళగలిగితే ఏ పండ్లో , బట్టలో తెసుకువెళ్ళగలిగితే చాలా సంతోషం....

అమెరికాలో ఉన్నవారు మీరు సహాయం చేయదలిస్తే నా అకౌంట్ నెంబరు మీకు మెయిలు చేస్తాను... మీరు ఇచ్చిన $1 ఐనా సరే నేను వారికి పంపి ఆ స్క్రీనుషాట్ మీకు పంపిస్థాను.

ఇండియా వారైతే మీకు వారి అకౌంట్ నెంబరు మెయిలు లో ఇస్తాను..

అంతే కాదు మీకు వారి పూర్తి వివరాలు ఇదే బ్లాగులో చివరన ఇస్తాను.....
మీరు ముందుగా వారికి కాల్ చేసి మీకు నమ్మకం కుదిరాకే ఏ సహాయం అయినా చేయండి...

మీరు ఇచ్చే 10 రూపాయలతో వారికి 10 పెన్సిళ్ళు వస్తాయి....
మీరు ఇచ్చే ఒక్క డాలరుతో వారికి కొన్ని పుస్తకాలు వస్తాయి......

అలోచించండి....... సహాయం చేయదలిచిన వారు నాకు మెయిలు చేసినా, ఇక్కడ కామెంటు పెట్టినా సరిపోతుంది....


Address : 


Shanthi Welfare Association for Deaf, Blind and handicapped
D.No 20-5-116
Contractors Colony
Dhyana Ashram
New Palvancha
507115
Khammam A.P

Contact :

K. Chrysolite  --  9346465642
SSV Sagar  -- 9346376707 (Manager)


18 comments:

 1. మాధవి నాకు అకౌంట్ నెంబరు మెయిలు ఇవ్వు.అలాగే మనం ఇంకా ఏమి చేయగలమో ప్లాన్ చేద్దాము.

  ReplyDelete
 2. తప్పకుండా శైలూ .... నీకు అన్ని విషయాలు మెయిలు చేస్తాను....

  ReplyDelete
 3. నేను బ్లాగులో పూర్తిగా రాయలేదు కానీ శైలూ.....
  ఒక తల్లి పుట్టబొయే బిడ్డని వద్దనుకొని మాత్రలు మింగితే....
  బిడ్డ చనిపోక.... చూపులేనిదై పుట్టింది......
  అయినా ఆ పాప ఎంత తెలివైనదో తెలుసా......
  ఆల్ఫబెట్స్ అన్నీ ఒక నెలలో నేర్చేసుకుంది......
  ఎన్ని మాటలో సైగలతో చెప్తుంది.....

  ఇలా ఒక్కొక్కరి గురించి చెబితే చాలా ఉంది.....

  తప్పక వీరందరికీ ఏదైనా శాశ్వత సహాయం కల్పించాలి...

  ReplyDelete
 4. Details sent to your mail.
  Thanks a ton Maitreyi garu.....
  May GOD bless you and you family.....

  ReplyDelete
 5. fine.let us do something for a
  genuine cause.
  sarma

  ReplyDelete
 6. fine.let us do something for a
  genuine cause.
  sarma

  ReplyDelete
 7. hi madhavi, contractors colony ma intiki chala daggara....but naku asalu telidu..akada ilanti pillalu badhapaduthunnarani...any how thanks for the information.... neekem help kavalanna nannu adugu...i promise i will surely work for them for the 24 hours if need.... thanks again... junny...

  ReplyDelete
 8. T.S.V.R.P. SARMA - Thanks .... Email sent


  junny....fayaz - Shall send you an e-mail with complete details.

  ReplyDelete
 9. good work. we're promoting this link through our organisation's site,

  http://sahrudayorg.hpage.in

  ReplyDelete
 10. Thanks a lot Sahruday Organisation.
  Thanks for responding to my post and spreading the word out.

  ReplyDelete
 11. Madavi mam, Meeru chese ilanti manchi panuka valla......Koddi mandi marina chalu mam. We can`t change the country Suddenly. But somebody will inspire by these type of Programs. God bless u With Full life and Peace full life.

  ReplyDelete
 12. I am in us and would like to help.please provide additional details

  ReplyDelete
  Replies
  1. Could you please send an email to helpinghandsandminds@gmail.com , I shall send you the details.
   Thanks

   Delete
 13. can you email the acct details?

  ReplyDelete
  Replies
  1. could you please share your mail id or send an email to helpinghandsandminds@gmail.com. Thanks a lot.

   Delete