ఇది నేను రాసిన తొలి కవిత ........
నీకై తలచిన ప్రతి తలపు ఒక అక్షరమై
నా కలం లోంచి జాలువారగా.......
నిన్నే తలంచి రాసే ప్రతి మాట
ఒక కవితై వెల్లువించగా...........
నా గుండెల్లో నీకై దాగిన ప్రేమే
మన ఈ దూరాలను దూరం చేయగా ........
నేను వేసే ప్రతి అడుగు
మన ఇద్దరిని ఏకం చేయదా...!
ఆ క్షణం కోసమే ప్రతి క్షణం ఒక యుగం లాగా
ఎదురు చూస్తుంది నా ఎద.....!
ఎలా ఉందండీ ఈ నా తొలి ప్రయత్నం ......?